Home » కొత్తగా కొత్తగా – ఎం సి ఎ

కొత్తగా కొత్తగా – ఎం సి ఎ

by Haseena SK
810 views
kothaga kothaga song

ఓ కొత్తగా కొత్తగా రెక్కలొచ్చినట్టుగా
క్షణముకొక్క నిమిషమల్లె
గడుపుదాం పదా
ఓ వింతగా వింతగా మంత్రమేసినట్టుగా
నిమిషంఒక్క గంట లాగా
గడుపుదాం పద

ఓ మేఘమే కాస్త పెంచిన
గంటకిన్ని పూటలంటూ మూటకట్టనా
ఆ పూటకిన్ని రోజులంటూ
పంచి పెట్టనా
రోజుకొక్క వారమంటూ
నడక మార్చనా
ప్రేమ పంచడంలో నిన్ను మించన

ఎండైన ఎండైన వానైనా వానైనా
మన తీరే ఆగేనా నిన్నైనా నిన్నైనా
రేపైనా రేపైనా అరక్షణమే ఇకపైన
ఓ కొత్తగా కొత్తగా రెక్కలొచ్చినట్టుగా
క్షణముకొక్క నిమిషమల్లె
గడుపుదాం పద
వింతగా వింతగా మంత్రమేసినట్టుగా
నిమిషంఒక్క గంట లాగ
గడుపుదాం పద

ఓ ఎక్కడుందో నాకు
నచ్చబోయే పిల్ల అంటూ
ఎప్పుడొచ్చి నన్ను కోరి
చేరుతుందో అంటూ
ఊహించుకున్న నిమిషంఎక్కడున్న
నిన్ను తీసుకెళ్లి చూపనా

నిన్ను చూడగానే
న మొదటి భావణేంటో
నిన్ను చేరలేక నేను పడ్డ వేదనేంటో
చెప్పలేనిదంటూ నిన్నే చూడమంటూ
ఆ ఘడియలోకి లాగన
కలుసుకొని వేళలంటూ లెక్కగట్టన
మనం కలుసుకున్న వేళా
వెలికంటా గట్టన
అలిసిపోవడాన్ని తీసి పక్కనెట్టన
నిన్ను తెలుసుకోవడంలో తేలన

ఎండైన ఎండైన వానైనా వానైనా
మన తీరే ఆగేనా నిన్నైనా నిన్నైనా
రేపైనా రేపైనా అరక్షణమే ఇకపైన

సన్రైస్ చూడాలి నీ పక్కనుంటూ
మూన్లైట్ తాకాలి నీ ఊసు వింటూ
సన్ మూన్ ని తెచ్చి
పక్క పక్కనెట్టే
టైం వేస్ట్ ఏ చేయక

నీ రూపు చూడాలి రెప్ప విప్పగానే
నువ్వు జోలపాడాలి రాతిరవ్వగానే
రేయి పగలు తెచ్చి ఒక్క చోట కట్టాయి
ఎడబాటు లేదిక
పక్కనోళ్ళ టైం కూడా దొంగిలించన
బేరమెత్తుకున్న కళల
వరసపెట్టి తీర్చన
లేకపోతే లోకమంతా కాలమాపణ
ఇన్నినాళ్ళ ప్రేమ వెలితి నింపైనా

ఎండైన ఎండైన వానైనా వానైనా
మన తీరే ఆగేనా నిన్నైనా నిన్నైనా
రేపైనా రేపైనా అరక్షణమే ఇకపైన

మరిన్ని పాటల కోసం తెలుగు రీడర్స్ ను సందర్శించండి.

You may also like

Leave a Comment

Adblock Detected

Please support us by disabling your AdBlocker extension from your browsers for our website.