అనగా అనగా మొదలూ

 మీతోనే మీలోనే కలిసున్నా

 కాలం కదిలే వరకూ

 మీతోనే కొనసాగే కలగన్నా

 నీ వలనే నేనున్న

 నా విలువే నీవన్న

 జగమేలే నా హృదయాన్నేలే

 జానకివి నువ్వే

 ప్రియ మిథునం

 మనలా జతగూడీ వరమై

 ఇరువురిదొక దేహం ఒక ప్రాణం

 మన కధనం తరముల

 దరి దాటే స్వరమై

 పలువురు కొనియాడే కొలమానం

 అయోధ్యను మించినది

 అనురాగపు సామ్రాజ్యం 

అభిరాముని పుణ్యమెగా

 అవనిజకి సౌభాగ్యం

 తమ విల్లే శోభిల్లి

 ఆనోరినిని నేనేలే

 పతివ్రతలే ప్రణమిల్లే 

గుణసుందరివే

 నీపైనే ప్రతిధ్యాస

 నీతోనే తుది శ్వాస 

జగమేలే నా హృదయాన్నేలే 

జానకివి నువ్వే

 ప్రియ మిథునం

 మనలా జతగూడీ వరమై

 ఇరువురిదొక దేహం ఒక ప్రాణం

 మన కధనం తరముల

 దరి దాటే స్వరమై

 పలువురు కొనియాడే కొలమానం

మరిన్ని పాటల కోసం తెలుగు రీడర్స్ ను సందర్శించండి.

Leave a Reply

Your email address will not be published