Home » వెతుకు వెతుకు – సత్యభామ

వెతుకు వెతుకు – సత్యభామ

by Rahila SK
0 comments

పాట: వెతుకు వెతుకు
దర్శకుడు: సుమన్ చిక్కాల
గాయకుడు: M M కీరవాణి
సంగీతం: శ్రీ చరణ్ పాకాల
సాహిత్యం: చంద్రబోస్
చిత్రం: సత్యభామ (2024)
నటీనటులు: కాజల్ అగర్వాల్, నవీన్ చంద్ర


vethuku vethuku song lyrics satyabhama

వెతుకు వెతుకు వెతుకు
వెనుదిరగకుండా వెతుకు
వెతుకు వెతుకు వెతుకు
వెనుకాడకుండా వెతుకు

ఆశ కొరకు నిరాశలోనే వెతుకూ… వెతుకు…
కాంతి కొరకు నిశీధిలోనే వెతుకూ…

పొందాల్సిన దాన్నే పోయిన చోటే వెతుకూ
కోల్పోయిన చోటే వెతుకూ… వెతుకు వెతుకూ…

వెతుకు వెతుకు వెతుకు
వెళుతూ వెళుతూ వెతుకు
వెతుకు వెతుకు వెతుకు
పడుతూ లేస్తూనే వెతుకు

ఆగేది తుది మజిలీ కాదు
అడుగేసి సాగాలీ
ఆపేది అవరోధం కాదు
ఆపైకి చేరాలి

లోకం ఔనన్నా కాదన్నా
లక్ష్యం ఛేదించాలి
సంద్రాలెన్నున్నా ముంచేలా
స్వేదం పొంగాలీ

నిజానిజాలను నీడల్లోనే వెతుకూ… వెతుకు…
నిన్నటి అడుగుజాడల్లోనే వెతుకూ…వెతుకు…
రేపటికై నిన్నటిలోనే వెతుకూ… వెతుకు…
జవాబుకై ప్రశ్నల్లోనే వెతుకూ… వెతుకు…

పొందాల్సిన దాన్నే పోయిన చోటే వెతుకూ…
కోల్పోయిన చోటే వెతుకూ…వెతుకూ వెతుకూ…

మరిన్ని పాటల సాహిత్యం కొరకుతెలుగు రీడర్స్ను సందర్శించండి.

You may also like

Leave a Comment