Home » ‘SSMB29’ మూవీలో విలన్‌గా మలయాళ హీరో

‘SSMB29’ మూవీలో విలన్‌గా మలయాళ హీరో

by Shalini D
0 comments

మహేశ్, రాజమౌళి కాంబినేషన్లో తెరకెక్కనున్న ‘SSMB29’ మూవీపై అభిమానుల్లో భారీ అంచనాలు నెలకొన్నాయి. ప్రస్తుతం ప్రీప్రొడక్షన్ పనులు జరుగుతున్న ఈ సినిమాకు సంబంధించి ఓ క్రేజీ న్యూస్ వైరలవుతోంది. మలయాళ హీరో పృథ్వీరాజ్ సుకుమారన్ ఈ చిత్రంలో ప్రతినాయకుడిగా నటిస్తారని సమాచారం. దీనిపై మూవీ యూనిట్ నుంచి అధికారిక ప్రకటన రావాల్సి ఉంది. సలార్ సినిమాలో వరదరాజ మన్నార్‌గా పృథ్వీరాజ్ నటన ప్రేక్షకులను ఆకట్టుకుంది.

మహేశ్ బాబు – రాజమౌళి చిత్రంలో విలన్‍గా మలయాళ స్టార్ నటుడు పృథ్విరాజ్ సుకుమారన్ నటించనున్నారనే విషయం బయటికి వచ్చింది. ప్రభాస్ హీరోగా చేసిన సలార్‌లో ఓ ప్రధాన పాత్ర చేసిన పృథ్విరాజ్ పాన్ ఇండియా రేంజ్‍లో పాపులర్ అయ్యారు. ఇప్పుడు ఏకంగా మహేశ్ – రాజమౌళి చిత్రంలోనే ఆయనకు విలన్ క్యారెక్టర్ ఛాన్స్ దక్కినట్టు తెలుస్తోంది.

ఈ చిత్రంలో పృథ్విరాజ్ సుకుమారన్ పాత్ర రెగ్యులర్ విలన్‍గా ఉండదని, చాలా బాగా రాసిన మలుపు ఉండే క్యారెక్టర్ అని సంబంధిత వర్గాలు చెప్పినట్టు పింక్‍‍విల్లా రిపోర్ట్ వెల్లడించింది. “హీరో వర్సెస్ విలన్ పోరును ఎస్ఎస్ఎంబీ 29లో రాజమౌళి చాలా కొత్తగా చూపించనున్నారు. ఓ సాధారణ విలన్ పాత్రను పృథ్విరాజ్ ఈ చిత్రంలో చేయడం లేదు.

చాలా బాగా రాసిన, ఆర్క్ ఉండే క్యారెక్టర్ అది. ఆ పాత్రకు సొంతంగా బ్యాక్‍స్టోరీ ఉంటుంది. రాజమౌళి, మహేశ్ బాబుతో తొలిసారి పని చేయనుండటం పట్ల ఉత్సాహాన్ని పృథ్విరాజ్ వ్యక్తం చేశారు” అని ఆ రిపోర్ట్ వెల్లడించింది.

మరిన్ని సమాచారాల కోసంతెలుగు రీడర్స్ సినిమాను సందర్శించండి.

You may also like

Leave a Comment