SSMB 29 (వర్కింగ్ టైటిల్). దర్శకధీరుడు రాజమౌళి (rajamouli) తీయబోతున్న ఈ సినిమా ఎప్పుడెప్పుడు మొదలవుతుందా అని అందరూ ఎదురుచూస్తున్నారు. ప్రస్తతం ప్రీ ప్రొడక్షన్ పనులు జరుపుకుంటున్న ఈ సినిమా కోసం మహేష్ బాబు (mahesh babu) కూడా కొత్త లుక్‌లో ట్రాన్స్‌ఫామ్ అవుతున్నారు. అయితే ఈ సినిమా క్యాస్టింగ్‌పై ఎప్పటి నుంచో చాలా రూమర్స్ వస్తున్నాయి. ఈ చిత్రంలో పలువురు హాలీవుడ్ నటీనటులు ఉండబోతున్నారని వార్తలు కూడా వచ్చాయి. అయితే వీటిపై ఈ మధ్య నిర్మాతలు కూడా రియాక్ట్ అయ్యారు.
మహేష్-రాజమౌళి సినిమా క్యాస్టింగ్ ఇంకా పూర్తి కాలేదని.. ఈ ప్రాజెక్టుపై వచ్చే రూమర్స్‌ని ఎవరూ నమ్మొదని.. ఏది ఉన్నా అఫీషియల్‌గా ప్రకటిస్తామంటూ చెప్పుకొచ్చారు. అయినా కూడా ఈ సినిమాలో వాళ్లు ఉన్నారు.. వీళ్లున్నారు అంటూ వార్తలు వస్తున్నాయి. అయితే తాజాగా ఈ సినిమాలో మహేష్ బాబు పక్కన ఆ ఇద్దరు హీరోయిన్లను సెలక్ట్ చేయండంటూ ఫ్యాన్స్ ఓ రికెస్ట్ చేస్తున్నారు. ఆ సంగతేంటో చూద్దాం.
తాజాగా మహేష్ బాబు ఫ్యాన్స్ తరచుగా సోషల్ మీడియాలో ఓ పోస్టు పెడుతున్నారు. మహేష్-రాజమౌళి సినిమాలో కేథరిన్ లాంగ్‌ఫోర్డ్ katherine langford, జోసెఫిన్ లాంగ్‌ఫోర్డ్( joseph langford) ఇద్దరినీ హీరోయిన్లుగా తీసుకోవాలని రాజమౌళిని రిక్వెస్ట్ చేస్తున్నారు. ఆస్ట్రేలియాకి చెందిన ఈ ఇద్దరు హీరోయిన్లు ఇప్పటికే పలు టీవీ సిరీస్, సినిమాల ద్వారా క్రేజ్ తెచ్చుకున్నారు. ముఖ్యంగా అందంలో వీరికి వీరే పోటీ అన్నట్లుగా ఉంటారు. అయితే ఇక్కడ మరో విషయం ఏంటంటే.. కేథరిన్ – జోసెఫిన్ ఇద్దరూ సొంత అక్కాచెల్లెళ్లు. లవ్ సైమన్ (love simon), నైవ్స్ ఔట్, స్పాంటేనియస్ వంటి చిత్రాల ద్వారా కేథరిన్ (katherine) స్టార్ హీరోయిన్ అయింది. మరోవైపు తన చెల్లెలు జోసెఫిన్ (joseph). ఆఫ్టర్, ఆఫ్టర్ ఉయ్ కొలైడెడ్, ఆఫ్టర్ ఉయ్ ఫెల్, ఆఫ్టర్ ఎవర్ హ్యాపీ, ఆఫ్టర్ ఎవ్రిథింగ్ వంటి సిరీస్ ద్వారా యూత్‌లో సూపర్ క్రేజ్ దక్కించుకుంది. ఈ సిరీస్‌లలో జోసెఫిన్ అందాల ఆరబోత వేరే లెవల్లో ఉంటుంది. నెట్‌ఫ్లిక్స్‌లో ఈ సిరీస్ అందుబాటులో ఉంది.
ఇక వీరిద్దరినీ మహేష్ బాబు పక్కన హీరోయిన్లుగా తీసుకోవాలంటూ ఫ్యాన్స్ కోరుతున్నారు. ఇద్దరూ కాకపోయినా కనీసం ఒక్కరినైనా సెట్ చేయండి సార్ అంటూ జక్కన్నని రిక్వెస్ట్ చేస్తున్నారు. మరోవైపు ఈ ప్రాజెక్టులో ఇండోనేసియా నటి చెల్సియా ఎలిజబెత్ ఇస్లాన్ హీరోయిన్‌గా నటిస్తుందంటూ కూడా పుకార్లు వచ్చాయి. మరి మొత్తానికి జక్కన్న ఎవరిని సెలక్ట్ చేస్తారో చూడాలి. కానీ SSMB 29 పై బజ్ మాత్రం మాములుగా లేదు. అతి త్వరలోనే పూజా కార్యక్రమాలతో ఈ సినిమా మొదలుకానుంది.
40