Home » శంకర్, రెహమాన్ మధ్య గ్యాప్…ఎందుకు?

శంకర్, రెహమాన్ మధ్య గ్యాప్…ఎందుకు?

by Vinod G
0 comments

హాయ్ తెలుగు రీడర్స్ ! క్రియేటివ్ డైరెక్టర్ శంకర్, ఆస్కార్ అవార్డు విన్నర్ ఏ ఆర్ రెహమాన్ కాంబినేషన్ అంటే సూపర్ అని మన అందరికి తెలుసు, వీరి కాంబినేషన్ ఎన్ని మరపు రాని హిట్స్ ఇచ్చారో మన అందరికి తెలుసు, ఇంకా ఇస్తున్నారు కూడా. అయితే వీరి కాంబినేషన్ కి కూడా బ్రేక్ పడిందని మీకు తెలుసా ? వీరి కాంబినేషన్ బాయ్స్ సినిమా తరువాత బ్రేక్ పడింది అని మీకు తెలుసా ? సరే అసలు ఏమైంది ! ఎదుకు వీళ్ళ మధ్య గ్యాప్ వచ్చింది ! అనేది ఇప్పుడు మనం వివరంగా పరిశీలిద్దాం.

“జెంటిల్ మెన్” సినిమా నుండి వీరి కాంబినేషన్ మొదలయింది. అప్పుడు మొదలెట్టిన వీరి కాంబినేషన్ ఎన్నో మరపురాని హిట్స్ తో సాగుతూ వస్తుంది. అయితే బాయ్స్ సినిమా తరువాత వీరి మధ్య కొంతకాలం గ్యాప్ వచ్చింది. ఎందుకంటే క్రియేటివ్ డైరెక్టర్ శంకర్ డైరెక్ట్ చేసిన “బాయ్స్” సినిమా చూసారుగా, ఆ సినిమాలో చాల ఫేమస్ కామెడీ సీన్ ఒకటి వుంది. అదేంటంటే ఒక కమెడియన్ “ఇంఫార్మాషన్ ఈజ్ వెల్త్” అనే డైలాగ్ తో బాగా ఫేమస్ అయ్యారు, ఆ కమెడియన్ కి ఏ ఏ గుడులలో ఏ రోజున ప్రసాదం పెడతారు, అలాగే ఏ చర్చి లో ఎప్పుడు పెడతారు, అలాగే మసీద్ లో ఎప్ప్పుడు అనేది అతడి దగ్గర ఇన్ఫర్మేషన్ ఉంటుంది. దాన్ని బట్టి అతడు వెళుతుంటాడు.

అయితే అసలు విషయం ఏమిటంటే, ఈ సినిమా కి మ్యూజిక్ డైరెక్టర్ అయిన రెహ్మాన్ బ్యాగ్రౌండ్ మ్యూజిక్ రెడీ చేసే క్రమంలో ఆ సీన్ అతడికి నచ్చలేదంట, ఎందుకనే విషయానికి వస్తే ఆ రెహ్మాన్ వాళ్ళ ఫ్యామిలీ కూడా అదే విధంగా అన్నదానం చేస్తూండేవారంట. అందుకని ఆ సీన్ రెహమాన్ కి నచ్చక శంకర్ తో ఆ సీన్ తీసేయ్ అని రిక్వెస్ట్ చేసారంట. కానీ దానికి శంకర్ ఒప్పుకోలేదంట, ఆ సీన్ నిన్ను ఉద్దేశిస్తే పెట్టినది కాదని, అది సినిమాలో భాగం అని చెప్పారంట. అది మూవీ కే హైలెట్ పాయింట్ అని, అది కుదరదని చెప్పారంట, అప్పుడు రెహమాన్ గారు ఇంతగా రిక్వెస్ట్ చేస్తున్నా ఒప్ప్పుకొవడం లేదని, నేను ఇక శంకర్ తో సినిమాలు చేయనని అనుకున్నారంట. ఈ విధంగా వీరి మధ్య కొంత కాలం గ్యాప్ వచ్చింది. తరువాత మల్లి వాళ్లిద్దరూ ఒక్కటయ్యారు, అలాగే ఎన్నో హిట్స్ కూడా ఇచ్చారు, ఇక అవన్నీ మనకి తెలిసిననే….

ఇటువంటి మరిన్ని ఇంట్రెస్టింగ్ విశేషాలు కొరకు తెలుగు రీడర్స్ సందర్శించండి.

You may also like

Leave a Comment