హాయ్ తెలుగు రీడర్స్! మన దర్సకేంద్రుడు రాఘవేంద్రరావు గారి నుండి కొత్త సినిమా అప్డేట్ రాక చాల రోజులయింది. అయితే దర్శకేంద్రుడి నుండి భక్తికి సంబంధించిన కొత్త సినిమా అప్డేట్ వస్తే, అదికూడా రెబల్ స్టార్ ప్రభాస్ భక్తిరస పాత్రలో మెయిన్ రోల్ చేస్తే ఎలావుంటుంది? ఈ కాంబినేషన్ చూస్తే బాగుండు అని మీరు అనుకుంటున్నారా!
అయితే సిద్ధంగా ఉండండి, ఎందుకంటే వీరి కాంబినేషన్ లో ఒక డేవోషల్ సినిమా రావచ్చనిపిస్తుంది. భారీ దేహదారుఢ్యం కలిగిన ప్రభాస్, అలాగే డైరెక్షన్లో పండిపోయిన రాఘవేంద్రరావు కాంబినేషన్ అంటే ఎలా ఉంటుందో ప్రేత్యేకంగా చెప్పవలసిన అవసరం లేదు. అయితే ఎప్పుడూ పాన్ ఇండియా సినిమాలు తో బిజీగా ఉండే మన ప్రభాస్, భక్తిరస పాత్రలు చేస్తాడా! దీనికి సమాధానం అవుననే చెప్పాలి.
ఎందుకంటే ఒక టీవీ కార్యక్రమంలో రాఘవేంద్ర రావు గారు ప్రభాస్ గారిని మీ బాడీ లాంగ్వేజ్ భక్తిరస పాత్రలకి కరెక్ట్ గా సూట్ అవుతుంది అని చెప్పడం జరిగింది. దాంతో పాటు ఒకవేళ అవకాశం వస్తే మీతో తప్పకుండా ఒక భక్తి రస పాత్రతో సినిమా చేస్తానని రాఘవేంద్ర రావు గారు చెప్పడం జరిగింది. దానికి ప్రభాస్ కూడా మీరు చెప్పాలి కానీ నేను తప్పకుండా చేస్తానని మాట చెప్పడం జరిగింది. ఇలా వీరి మధ్య సంభాషణ జరిగింది.కాబట్టి వీరి కాంబినేషన్లో ఒక మంచి భక్తి రసం చిత్రం రావచ్చని టాక్. వస్తే బాగుండు అని మీకు అనిపిస్తుందా. అయితే వేచి చూద్దాం ఈ కాంబినేషన్ కోసం.
మరిన్ని ఇటువంటి సినీవిశేషాలు కొరకు తెలుగు రీడర్స్ సినీ విశేషాలు ని సందర్శించండి.