Home » యష్ కొత్తసినిమా టాక్సిక్ (ToXIC) – పూజ కార్యక్రమం మొదలు (TOXIC Pooja Ceremony)

యష్ కొత్తసినిమా టాక్సిక్ (ToXIC) – పూజ కార్యక్రమం మొదలు (TOXIC Pooja Ceremony)

by Vinod G
0 comment

KGF స్టార్ హీరో యష్ ఫాన్స్ కు ఒక మంచి శుభవార్త, ఏంటంటే రాకింగ్ స్టార్ యష్ కొత్త సినిమా అప్డేట్ వచ్చేసింది. KGF సినిమాలతో మంచి పేరు తెచ్చుకున్న కన్నడ హీరో యాష్ మరో కొత్త సినిమా మొదలు పెట్టారు. చిత్రం పేరును టాక్సిక్ (ToXIC) గా ఖరారు చేసారు. ఇది హీరో యష్ కెరీర్ లో తనకి 19 చిత్రం గా నిలుస్తుంది. ఈ చిత్రానికి గీతు మోహన్ దాస్ (GeetuMohandas) దర్శకత్వం వహిస్తున్నారు.

ఈ చిత్రాన్ని KVN ప్రొడక్షన్స్ మరియు మాన్స్టర్ మైండ్ క్రియేషన్స్ బ్యానర్ పై వెంకట్ కె. నారాయణ మరియు యష్ సంయుక్తంగా నిర్మిస్తున్నారు. ఈ సినిమాకు సంబందించిన పూజ కార్యక్రమాలు కూడా పూర్తి అయ్యాయి. ఇందులో నయనతార, హుమా ఖురేషి కీలక పత్రాలు పోషిస్తున్నట్లు సమాచారం. అయితే ఇంకా ప్రధాన నటుల వివరాలు అనేవి ఇంకా తెలియాల్సివుంది. ఈ టాక్సిక్ (ToXIC) సినిమాను ఏప్రిల్ 10 (2025) విధులకు సిద్ధం చేయాలని మేకర్స్ భావిస్తున్నట్లు సమాచారం.


మరిన్ని ఇటువంటి లేటెస్ట్ విషయాల కొరకు తెలుగు రీడర్స్ సినిమా ను చూడండి.

You may also like

Leave a Comment