Home » జైలర్ డైరెక్టర్ నెల్సన్ దిలీప్‌కుమార్ తో అల్లు అర్జున్ కొత్త సినిమా 

జైలర్ డైరెక్టర్ నెల్సన్ దిలీప్‌కుమార్ తో అల్లు అర్జున్ కొత్త సినిమా 

by Lakshmi Guradasi
407 views
Alluarjun new movie

నెల్సన్ దిలీప్‌కుమార్ సినిమా డైరెక్టర్ మరియు స్క్రీన్ రైటర్, అతను ముఖ్యంగా తమిళ సినిమాలో పనిచేస్తుంటాడు. అతను 2010లో సిలంబరసన్ నటించిన వెట్టై మన్నన్‌ సినిమాతో తన కెరీర్‌ను మొదలుపెట్టాడు. అయితే అది కొన్ని కారణాల వల్ల అది ఆగిపోయింది. ఆ తర్వాత కోలమావు కోకిల సినిమాకు డైరెక్టర్ గా పనిచేసి, సినీపరిశ్రమలోకి అడుగుపెట్టాడు.

ఈ మధ్య కాలంలో “జైలర్” సినిమా ప్రపంచవ్యాప్తంగా 650 కోట్ల రూపాయలకు పైగా వసూలు చేసింది మరియు పాజిటివ్ రెస్పాన్స్ వచ్చింది. జైలర్, బీస్ట్ వంటి ఆక్షన్ మూవీస్ కు డైరెక్టర్ గా మంచి హిట్ అందుకున్నారు. ఇప్పుడు సరికొత్తగా పాన్ ఇండియా స్టార్ అల్లు అర్జున్ కి తన కథను చెప్పినట్టుగా వార్తలు వస్తున్నాయి. 

అల్లు అర్జున్ ప్రస్తుతం “పుష్ప ది రూల్” లో పని చేస్తున్నాడు. ఇప్పటికే అల్లు అర్జున్ ఈ మూవీ షూటింగ్ లో బిజీ గా ఉన్నాడు. అయితే ఈ సినిమా డిసెంబర్ 6 న విడుదులకు సిద్ధంగా ఉంది. డైరెక్టర్ త్రివిక్రమ్ శ్రీనివాస్ మరియు సందీప్ వంగ కూడా ప్రస్తుత స్టార్ అల్లు అర్జున్‌తో కలిసి పనిచేయడానికి ప్లాన్‌లో ఉన్నారు. కానీ వాళ్ళ సినిమాలకి చాలా సమయం పడుతుందని నెల్సన్ దిలీప్‌కుమార్ కు ఓకే చెప్పినట్టు తెలుస్తుంది. 

అల్లు అర్జున్ వచ్చే ఏడాది నెల్సన్‌తో కలిసి పని చేస్తాడు అంటున్నారు. ఈ సినిమా ప్రాజెక్ట్ రూ. 200 కోట్ల బడ్జెట్ మరియు స్పెషల్ యాక్షన్ స్టోరీ కలిగి ఉంటుందని అంటున్నారు. ఈ విషయం ఇంకా ఆఫీసియల్ అనౌన్స్ చేయలేదు.

మరిన్ని ఇటువంటి వాటి కోసం తెలుగు రీడర్స్ సినిమా ను చుడండి.

You may also like

Leave a Comment

Adblock Detected

Please support us by disabling your AdBlocker extension from your browsers for our website.