Home » Sobhita Dhulipala – మూవీస్, బయోగ్రఫీ, మ్యారేజ్ అండ్ ఫొటోస్…… 

Sobhita Dhulipala – మూవీస్, బయోగ్రఫీ, మ్యారేజ్ అండ్ ఫొటోస్…… 

by Lakshmi Guradasi
630 views
sobhita dhulipala photos lifestyle

ప్రతుతం ప్రముఖ హీరో నాగచైతన్య సమంతాను పెళ్లి చేసుకుని విడిపోయాక, శోభిత ధూళిపాళ అనే నటిని ఎంగేజ్మెంట్ చేసుకుంటున్నాడు. సడన్గా ఈ విషయం తెలిసాక అభిమానులు షాక్ అవుతున్నారు. ఎప్పటికైనా నాగచైతన్య, సమంతా కాలుస్తారనే ఆశ నేటితో బ్రేక్ పడింది. 

శోభిత ధూళిపాళ, ఈమె ఎవ్వరన్ని నెటిజెన్స్ లో వార్తలు వస్తున్నాయి. ఈమె ఎవ్వరో కాదు  హిందీ, తెలుగు, తమిళం మరియు మలయాళం చిత్రాలలో అలాగే వెబ్ సిరీస్‌లలో నటించిన భారతీయ నటి. 

శోభితా ధూళిపాళ (Sobhita Dhulipala) మే 31, 1992న భారతదేశంలోని ఆంధ్రప్రదేశ్‌లోని తెనాలిలో జన్మించింది. తర్వాత విశాఖపట్నం వెళ్లిన ఆమె బాల్యంలో ఎక్కువ కాలం అక్కడే గడిపింది. ఆమె కామర్స్ మరియు ఎకనామిక్స్‌లో తన శిక్షణను అభ్యసించింది. తరువాత ముంబైలోని హెచ్‌ఆర్ కాలేజ్ ఆఫ్ కామర్స్ అండ్ ఎకనామిక్స్ నుండి పట్టాను సంపాదించుకుంది.

నటనలోకి ప్రవేశించే ముందు మోడల్‌గా తన వృత్తిని ప్రారంభించింది. 2013లో మిస్ ఇండియా ఎర్త్ టైటిల్ గెలుచుకోవడం ద్వారా శోభిత తొలి గుర్తింపు పొందింది. ఈ విజయం మిస్ ఎర్త్ 2013 పోటీలో భారతదేశానికి ప్రాతినిధ్యం వహించేలా చేసింది.

2016లో అనురాగ్ కశ్యప్ దర్శకత్వం వహించిన చిత్రం “రమణ్ రాఘవ్ 2.0″లో విక్కీ కౌశల్ సరసన నటించింది, దీనిలో ఆమె సైకాలజీ విద్యార్థిని స్మృతిక పాత్రలో నటించింది. శోభిత సినీ రంగంలోకి ఈ సినిమాతోనే వచ్చింది.

sobhita dhulipala photos lifestyle

2018లో శోభిత తెలుగు చలనచిత్రం “గూడాచారి” లో నటించింది. ఇందులో ఆమె సైకాలజీ గ్రాడ్యుయేట్ అయిన సమీరా రావు అనే ప్రధాన పాత్రలో నటించింది.

ఆమె అమెజాన్ ప్రైమ్ వీడియో సిరీస్ “మేడ్ ఇన్ హెవెన్” (2019)తో మంచి గుర్తింపు పొందింది, దీనిలో వెడ్డింగ్ ప్లానర్ గా “తారా ఖన్నా” అనే ప్రధాన పాత్రలో నటించింది.

sobhita dhulipala photos lifestyle

2019లో, శోభిత నివిన్ పౌలీతో కలిసి “మూథోన్” చిత్రంతో మలయాళ సినిమాల్లోకి అడుగుపెట్టింది. టొరంటో ఇంటర్నేషనల్ ఫిల్మ్ ఫెస్టివల్‌లో ప్రదర్శించబడిన, ఈ సినిమాలో ఆమె సెక్స్ వర్కర్ పాత్రలో నటించింది. ఆమె “ఘోస్ట్ స్టోరీస్” (2020), కురుప్” (2021)తో సహా పలు భాషల్లో వివిధ చిత్రాలలో నటించింది.

sobhita dhulipala photos lifestyle
sobhita dhulipala photos lifestyle

శోభిత ఇటీవలి మణిరత్నం దర్శకత్వం వహించిన “పొన్నియిన్ సెల్వన్: ఐ” మరియు “పొన్నియిన్ సెల్వన్: II” (2022-2023) లలో వానతి అనే పాత్రలో నటించింది. శోభిత అమెరికన్ సినిమా రంగ ప్రవేశం కూడా చేసింది, యాక్షన్ థ్రిల్లర్ చిత్రం “మంకీ మ్యాన్” (2024), ఎస్కార్ట్ పాత్రలో నటించింది.

ఆమె నటనతో పాటు, మోడల్‌గా ఆమె చేసిన వృత్తికి గుర్తింపు పొందింది. అదేవిధంగా వివిధ ఫ్యాషన్ మ్యాగజైన్‌ల కవర్‌లపై కూడా కనిపించింది.

ఈమె ఇటీవలి నాగచైతన్యతో డేటింగ్ లో ఉన్నట్టు పలు సోషల్ మీడియాల్లో ఫొటోస్ మరియు న్వార్తలొచ్చాయి. ప్రస్తుతం నాగచైతన్య, శోభిత లా పెళ్లి ని నాగార్జునే దెగ్గరుండీ జరిపిస్తున్నడంటా, అనే వార్తలు నెట్టింట వైరల్ అవుతున్నాయి.

Sobhitha dhulipala Instagram account: https://www.instagram.com/sobhitad/

ఇటువంటి మరిన్ని వాటి కోసం తెలుగు రీడర్స్ సినిమా ను చూడండి.

You may also like

Leave a Comment

Adblock Detected

Please support us by disabling your AdBlocker extension from your browsers for our website.