the poster of nadanadhu's role in the movie kannappa has been released

“కన్నప్ప” సినిమాలో నాదనాధుడి పాత్ర పోస్టర్ ను రిలీజ్ చేశారు

by Rahila SK

మంచు విష్ణు కాలక ప్రాజెక్టగా రూపొందుతోన్న చిత్రం “కన్నప్ప” మహభారత్ సిరీస్ ఫేమ్ ముఖేష్ కుమార్ సింగ్ దర్మకత్వం వహిస్తున్నారు. అవా ఎంటర్ టైన్ మెంట్, 24 ఫ్రేమ్స్ ఫ్యాక్టరీ బ్యానర్ల పై మంచు మోహన్ బాబు గారు నిర్మిస్తున్నారు. పాన్ ఇండియా స్థాయిలో ప్రతిష్టాత్మకంగా రూపొందుతున్న ఈ మూవీలో ప్రభాస్, మోహన్ బాబు, అక్షయ్ కుమార్, మోహన్ లాల్, శరత్ కుమార్, భ్రహ్మనందం, ప్రీతి ముకుందన్, కాజల్ అగర్వాల్, నయనతార వంటి వారు ముఖ్య పాత్రలు పోషిస్తున్నారు.

కాగా ఈ మూవీ జులై 14 న శరత్ కుమార్ పుట్టినరోజు సందర్భంగా ఈ మూవీలో అయన నటిస్తున్న నాదనాధుడి పాత్ర పోస్టర్ ను రిలీజ్ చేశారు. రెండు చేతుల్లో కత్తులు పట్టుకుని ఉగ్రరూపంలో ఉన్న ఓ యుధుడిలా కనిపిస్తున్నారు శరత్ కుమార్. “శివ భక్తుడైన కన్నప్ప కథను “కన్నప్ప” గా తెరపైకి తీసుకొస్తున్నాం. ఇటీవల విడుదల చేసిన టీజర్ తో ఈ సినిమాపై మరింత బజ్ ఏర్పడింది. ఇందులోని యాక్షన్ సీక్వన్స్, విజువల్స్ గురించి అందరూ మాట్లాడుతున్నారు. తెలుగు, తమిళ, మలయాళ, కన్నడ, హిందీ, ఇంగ్లీష్ భాషల్లో ఈ మూవీని గ్రాండ్ గా విడుదల చేసేందుకు సన్నాహాలు న్నాం అని చిత్ర యూనిట్ పేర్కొంది.

మరిన్ని ఇటువంటి వాటి కోసం తెలుగు రీడర్స్ సినిమా ను చుడండి.

You may also like