Home » OTT లోకి వచ్చేసిన తెలుగు సినిమా లవ్ మౌళి

OTT లోకి వచ్చేసిన తెలుగు సినిమా లవ్ మౌళి

by Vinod G
0 comments

హాయ్ తెలుగు రీడర్స్ ! నవదీప్ హీరో నటించిన తెలుగు సినిమా లవ్ మౌళి OTT లోకి వచ్చేస్తుందండోయ్. ఈ మూవీ రిలీజ్ అయిన మూడు వారాల్లోనే ఇప్పుడు ఓటీటీలోకి అడుగుపెడుతోంది. తాజాగా ఆహా ఓటీటీ రిలీజ్ డేట్ ను అనౌన్స్ చేసింది. ఈ సినిమా లవ్ మౌళి జూన్ 7న థియేటర్లలో రిలీజ్ అయింది. అయితే రిలీజ్ అయిన 50 రోజుల లోపలే జూన్ 27(2024) నుంచి ఆహా ఓటీటీలో స్ట్రీమింగ్ కానుంది.

డైరెక్టర్: అవనీంద్ర
మ్యూజిక్: గోవింద్ వసంత
తారాగణం: నవదీప్, పంఖురి గిద్వానీ, చార్వి దత్తా, మిర్చి హేమంత్, భావన సాగి, మిర్చి కిరణ్

కథ విషయానికి వస్తే…

తాను కోరుకునే అమ్మాయిని తానే స్వ‌యంగా సృష్టించుకునే శ‌క్తి ఓ యువ‌కుడి వ‌స్తే ఎలా ఉంటుంద‌నే పాయింట్‌కు ఫాంట‌సీ అంశాల‌ను మిళితం చేస్తూ ద‌ర్శ‌కుడు డిఫ‌రెంట్‌గా ఈ మూవీని తెర‌కెక్కించాడు. ప్రేమ‌, పెళ్లి విష‌యంలో యువ‌త‌రం ఆలోచ‌న‌లు, వాళ్ల‌లోని క‌న్ఫ్యూజ‌న్స్‌తో ఈ క‌థ‌ను రాసుకున్నాడు ద‌ర్శ‌కుడు అవ‌నీంద్ర‌.

సాధార‌ణే క‌థ‌నే అయినా న‌వ‌దీప్ క్యారెక్ట‌రైజైష‌న్‌ను కొత్త‌గా రాసుకుంటూ యూత్‌ఫుల్ ల‌వ్ ఎంట‌ర్‌టైన‌ర్‌గా ల‌వ్ మౌళి సినిమాను చివ‌రి వ‌ర‌కు ఇంట్రెస్టింగ్‌గా న‌డిపించాడు డైరెక్ట‌ర్‌. లిప్‌లాక్‌లు, బోల్డ్ సీన్స్‌తో మౌళి ల‌వ్ స్టోరీ రొమాంటిక్‌గా సాగుతుంది. ఓ ప్ర‌మోష‌న‌ల్ స్ట్రాట‌జీగా కాకుండా క‌థ‌లో అంత‌ర్భాగంగానే వ‌చ్చేలా ఆ సీన్స్ రాసుకున్న తీరు మెప్పిస్తుంది.

న‌టుడిగా నవ‌దీప్‌ను కొత్త కోణంలో చూపించిన మూవీ ఇది. అత‌డి లుక్‌లోనే కాకుండా న‌ట‌న‌లో వైవిధ్యం క‌న‌బ‌డింది. స‌మాజపు క‌ట్టుబాట్ల‌తో సంబంధం లేకుండా స్వేచ్ఛ‌గా బ‌తికే యువ‌కుడి పాత్ర‌లో చ‌క్క‌టి యాక్టింగ్‌ను క‌న‌బ‌రిచాడు. చిత్ర పాత్ర‌లో ఫంకూరి గిద్వానీ ఈ సినిమాకు మెయిన్ హైలైట్‌గా నిలిచింది. గ్లామ‌ర్‌ను పండిస్తూనే క్యారెక్ట‌ర్ ప‌రంగా ఆమె చూపించిన వేరియేష‌న్స్ మెప్పిస్తాయి. అఘోరాగా గెస్ట్ పాత్ర‌లో రానా ద‌గ్గుబాటి క‌నిపించి స‌ర్‌ప్రైజ్ చేశారు.

మరిన్ని ఇటువంటి ఇన్ఫర్మేషన్ కోసంతెలుగు రీడర్స్ OTTని సందర్శించండి.

You may also like

Leave a Comment