Home » కల్కి సినిమాలో చూపించే శంబలా నగరం చరిత్ర ఏంటి ? అసలు శంబలా ఉందా! ఉంటే ఎక్కడ వుంది?

కల్కి సినిమాలో చూపించే శంబలా నగరం చరిత్ర ఏంటి ? అసలు శంబలా ఉందా! ఉంటే ఎక్కడ వుంది?

by Vinod G
0 comment

హాయ్ తెలుగు రీడర్స్ ! ఈ మధ్య కాలంలో మనం ఎక్కువగా వింటున్న పదం ‘శంబలా’, ముఖ్యంగా నాగ్ అశ్విన్ తెరెకెక్కిస్తున్న ‘కల్కి’ సినిమా లో కూడా దీని గురించి తెలియచేసారు. ఈ మూవీ ట్రైలర్ లో కూడా శంబలా అనే ఒక రాజ్యం వున్నట్లుగా మనకు కనిపిస్తుంది. అసలు ఏంటి ఈ శంబలా? దీని కథ ఏంటి? అని పరిశీలించినట్లయితే, దీని గురించి మన పురాణాలలో ఈ విధంగా వివరించడం జరిగింది.

ఈ భూమి మీద అన్యాయం, అధర్మం పెరిగిపోయాయని, పాపాలు పెరిగి పరిస్థితి గోరంగా తయారైందని భూదేవి ఇంకా మిగతా దేవతలు, ఋషులు, మహామునులు శ్రీ మహావిష్ణువు వద్దను వెళ్లి మీరు ఏదోఒకటి చేసి ప్రపంచాన్ని కాపాడాలని వేడుకొంటారు. అప్పుడు విష్ణువు తన పదవ అవతారమైన కల్కి అవతరమెత్తి శంబలా అనే రాజ్యం లో విష్ణు వ్యాసుడు, సుమతి అనే ఒక బ్రాహ్మణ కుటుంబంలో జన్మిస్తానని, ఈ భూమి మీద పేరుకు పోయిన అన్యాయం, అధర్మం సమూలంగా నాశనం చేసి కలియుగాన్ని ముగిస్తానని, తరువాత కృత యుగం మొదలవుతుందని చెప్పడం జరుగుతుంది.

దీని ప్రకారం శ్రీమహావిష్ణువు ఆ బ్రాహ్మణ కుటుంబంలో జన్మిస్తాడు. శ్రీమహావిష్ణువు భార్య అయిన లక్ష్మి దేవి కూడా పద్మ అనే పేరుతో శంబలా నగరానికి రాజయిన బృహద్రథ , కౌముది దంపతులకు జన్మిస్తుంది. అయితే కల్కి జన్మించిన తరువాత తల్లి మరణిస్తుంది, కొంతకాలని తండ్రి కూడా మరణిస్తాడు. దీంతో ఇతనిని పరశురాముడు తీసుకువెళ్లి పెంచి, విలువిద్యలన్నీ నేర్పి పెద్దవాడిని చేస్తాడు. అయితే ఒక రోజు పెద్దవాడైన కల్కి తనకు విద్య నేర్పిన పరశురాముడిని గురుదక్షణ ఏమి కావలెను అని అడుగుతాడు.

దానికి పరశురాముడు నీవు శివుని వద్ద ఒక అస్త్రాన్ని పొందుతావు. తరువాత శంబలా రాజు కుమార్తెను పెళ్లి చేసుకుని ఈ శంబలా రాజ్యానికి మహా రాజు అవుతావు. తరువాత అన్యాయం, అధర్మం పేరుకు పోయిన కలియుగాన్ని నాశనం చేసి ధర్మ సంస్థాపన చేసి ఈ భూమండలాన్ని దేవపి, మరు అను దేవాంశ సంభూతులు అయిన ఇద్దరు రాజులకు అప్పగిస్తావు, ఇంతటితో నీ దర్మం పూర్తి అవుతుంది, ఇది నువ్వు సక్రమంగా చేయడమే నీవు నాకిచ్చే గురుదక్షణ అని చెప్తాడు. ఈ విధంగా కల్కి ధర్మ సంస్థాపన చేసిన తరువాత కలి యుగం ముగిసి సత్య యుగం మొదలవుతుంది, ఇది మన పురాణాలలో ఉండే కథ. నాగ్ అశ్విన్ తెరెక్కించే సినిమా స్టోరీ కూడా ఈ విధంగానే వెళుతుందని మనకి అర్ధమవుతుంది.

ఇక శంబలా విషయానికి వస్తే ఇది పుణ్య ఋషులు ఉండే స్థలం, ఇక్కడ ఎప్పుడూ సత్య యుగం నడుస్తుందని చెప్తారు. ఇక్కడి ప్రజలు అబద్దాలు చెప్పడం, అన్యాయం చేయడం వంటివి చేయరు. ఇక్కడ ఉండే ప్రజలు కూడా దాదాపు పది అడుగుల వరకు ఎత్తు ఉంటారు. ఇక్కడి ప్రజలందరూ సుఖ సంతోషాలతో ఉంటారు. అంతేకాకుండా ఇక్కడ గొప్ప వ్యక్తులు ఇక్కడ ఉంటారని తెలుస్తుంది. ఎందుకంటే శ్రీమహావిష్ణువు కల్కి గా జన్మించినపుడు పరశురాముడి తో పాటు ఎంతో గొప్ప గొప్ప వ్యక్తులు అతడిని చూడడానికి వస్తారని పురాణాలు వివరిసున్నాయి. అంతే కాకుండా పరుశురాముడే కల్కి కి విద్య నేర్పుతాడు. అంటే దీన్ని బట్టి మన పురాణాలలో ఉన్న చాలామందికి మరణం లేదని వారందరు శంబలా నగరంలో జీవిస్తున్నారని చెపుతారు. ఇక్కడ టెక్నాలిజీ కూడా మనకంటే చాల ముందు ఉంటుంది. అందువల్ల వారి రాజ్యం మనకి కనపడుట లేదని అంటారు. ఈ నగరం ప్రేత్యేక డైమెన్షన్లో ఉంటుందని అది సాదారణ మానవులకు కనపదని చెప్తారు. దీని గురించి చాల పురాణ గ్రంధాల్లో వివరించి ఉంది. దీని గురించి ఎంతో రీసెర్చ్ చేసినప్పటికీ ఎవరు కూడా దీని జాడ కనుగొనలేకపోయారు. మరి నాగ్ అశ్విన్ తెరెక్కించిన కల్కి 2898 AD సినిమాలో దీని గురించి ఏమి తెలియచేస్తాడో చూద్దాం..

మరిన్ని ఇటువంటి సినీవిశేషాలు కొరకు తెలుగు రీడర్స్ సినీ విశేషాలు ని సందర్శించండి.

You may also like

Leave a Comment