Home » priya bhavani shankar -ప్రియా భవాని శంకర్ మూవీస్, మ్యారేజ్, అండ్ ఫొటోస్….

priya bhavani shankar -ప్రియా భవాని శంకర్ మూవీస్, మ్యారేజ్, అండ్ ఫొటోస్….

by Lakshmi Guradasi
664 views
priya bhavani shankar biography and movies

ప్రియా భవాని శంకర్ తన అందం మరియు నటనతో ప్రేక్షకులను ఆకట్టుకుని, వరుస ఆఫర్లను పొందుతుంది. ఒక్కప్పుడు ఒక ఛానల్ లో న్యూస్ రీడర్ గా చేసింది. తరువాత యాంకర్ గా కూడా చేసింది. ఆలా ఆలా నటించడానికి తెర పైకి వచ్చింది.

ఆమె డిసెంబర్ 31, 1989న తమిళనాడులోని చెన్నైలో జన్మించింది. తన చదువు విషయానికి వస్తే బిజినెస్ అడ్మినిస్ట్రేషన్ లో మాస్టర్స్ డిగ్రీని పూర్తిచేసింది. ఈమె ఫేవరెట్ హీరో అల్లు అర్జున్ అని ఒక వేదిక లో షేర్ చేసుకున్నారు. రొమాంటిక్ మూవీ చేయాలంటే అది బన్నీ తోనే అంట.

priya bhavani shankar biography and movies

ఈమె చూడడానికి చాలా సింపుల్ గా కనిపిస్తుంది. హీరోయిన్ల కాకుండా ఒక నార్మల్ అమ్మాయిల కనిపిస్తుంది. ఈమె యాక్టింగ్ కూడా చాలా సాధారణంగా ఉంటుంది. చాలా పద్దతి గా మన తెలుగింటి అమ్మాయిలా కనిపిస్తుంది. మరి అంత బోల్డ్ సినిమాలలో నటించదు. కంటెంట్ ఉన్న సినిమాలను మాత్రమే ఎంచుకుంటుంది. తన ఛాయస్ ఎప్పుడు మధ్య తరహా కుటుంబం లో ఉండే
పల్లెటూరి అమ్మాయిలాంటి పాత్రలను ఎంచుకునేలా ఉంటుంది.

priya bhavani shankar biography and movies

ప్రియా టెలివిజన్ షో “కల్యాణం ముధల్ కాదల్ వరై” (2014-2016)తో నటనా రంగంలోకి వచ్చింది, అయితే, ఆమె తరువాత అద్భుతమైన పాత్రలో, తమిళ సినిమా “మేయాద మాన్” (2017)లో నటించింది. ఈ సినిమా ప్రేక్షకుల నుండి మంచి గుర్తింపు పొందింది.
అప్పటి నుండి, ప్రియా “కడైకుట్టి సింగం” (2018), “మాన్స్టర్” (2019), “మాఫియా: చాప్టర్ 1” (2020), “యానై” (2022), “తిరుచిత్రంబలం” (2020) వంటి సినిమాలలో నటించింది. “కడైకుట్టి సింగం”లో ఆమె నటనకు తమిళంలో “ఫిలింఫేర్ అవార్డు వచ్చింది”.

priya bhavani shankar biography and movies

తెలుగులో తీరు,భీమా ,రుద్రుడు, కళ్యాణం కమనీయం, వంటి సినిమాలలో నటించింది.ఇటీవల కాలంలో రత్నం, భారతీయుడు 2 వంటి సినిమాలతో తెలుగు ప్రేక్షకులకు మరింత దెగ్గర అయింది.

priya bhavani shankar biography and movies
priya bhavani shankar biography and movies

ఇప్పుడు ఈమె తమిళ హీరోయిన్ మాత్రమే కాదు తెలుగు సినిమా హీరోయిన్ కూడా. రాబోయే “డిమాంటీ కాలనీ 2” హారర్ సినిమాలో హీరోయిన్ గా నటించబోతుంది. ఆ సినిమా కోసం తెలుగు అభిమానులు ఎంతగానో ఎదురు చుస్తునారు.

priya bhavani shankar

ప్రియా భవాని శంకర్ రాజ్ అనే వ్యక్తి తో పదేళ్ళుగా రేలషన్ లో ఉన్నదంటా. వచ్చే ఏడాది కచ్చితంగా పెళ్లి చేసుకుంటాను అనింది. ఆ మాటలు ప్రస్తుతం వైరల్ అవ్వుతున్నాయి. తాను సినిమా ఇండస్ట్రీలోకి రాకముందే రాజ్ తో ప్రేమలో ఉందంట. అయితే బ్రేకప్ అయిందని చాలా పుకార్లు వచ్చిన పాటించుకోలేదంట. ఇప్పుడు ఇరువురు పెళ్లి పీటలు ఎక్కబోతున్నారు.

ప్రియా భవాని శంకర్ ఇంస్టాగ్రామ్ అకౌంట్: https://www.instagram.com/priyabhavanishankar/

ఇటువంటి మరిన్ని హీరోయిన్ల సమాచారం కోసం తెలుగు రీడర్స్ సినిమా ను చూడండి.

You may also like

Leave a Comment

Adblock Detected

Please support us by disabling your AdBlocker extension from your browsers for our website.