Home » గురిజాల గుట్టమీద సాంగ్ లిరిక్స్ – జానపద పాట

గురిజాల గుట్టమీద సాంగ్ లిరిక్స్ – జానపద పాట

by Lakshmi Guradasi
0 comments

గురజాల గుట్టమీద ధనియాలు దంచాపోతే
ధనియాలు పాడుగాను నాకు సళ్ళ చమాటలొచ్చే
మేనళ్ల పిల్లగాడు నన్ను మందలించరాడు
వారసయినా పిల్లవాడు నా చెమట తుడవరాడు

గురజాల గుట్టమీద ధనియాలు దంచాపోతే
ధనియాలు పాడుగాను నాకు సళ్ళ చమాటలొచ్చే

పొయ్యిమీద కుండా పెట్టి పాశర్లు వండుతుంటే
నకరంగా రంగిలిట్టే ఎగిరొచ్చి వడిలోపడినే
ఇకనైనా కానరాడు వాడి జాడ యాడలేదు
ఈ నిప్పు మీద నీళ్లు సల్లంగ రాగరాడు

గురజాల గుట్టమీద ధనియాలు దంచాపోతే
ధనియాలు పాడుగాను నాకు సళ్ళ చమాటలొచ్చే

శనివార్ల కొమ్మ నల్ల నిన్ను తొంగి చూసినాది
దాని మీద మన్ను బొయ్యా తోరళ్లగుడ్లగూబ
పిలిచినా పలకడయ్యే సిగపాపిటున్నవాడే
పాటించుకోడు చూడే నా మేనమామ వాడే

గురజాల గుట్టమీద ధనియాలు దంచాపోతే
ధనియాలు పాడుగాను నాకు సళ్ళ చమాటలొచ్చే

గా కట్ట పట్టి నేను కైకేళ్ళిపోతావుంటే
మా ఇరుగు పొరుగు మాట ఎదురెళ్ల దోసినవే
వాడి లగ్గా మడామంటూ లవ్ మాటలాడినారు
గా మాటలిన్న నాకు గౌరాలు పుట్టుకొచ్చే

గురజాల గుట్టమీద ధనియాలు దంచాపోతే
ధనియాలు పాడుగాను నాకు సళ్ళ చమాటలొచ్చే

వాడి నవ్వు నెలవంక వాడి మనస్సు మల్లెమొగ్గ
వాడి చూపు పైరగాలి నా వైపే మళ్ళినాది
నా కాళ్లు ఆగనంది వాడి వైపే సాగినాది
ఏడున్న వాడి జడ వాడ్ని చూసేదాకా వేద

గురజాల గుట్టమీద ధనియాలు దంచాపోతే
ధనియాలు పాడుగాను నాకు సళ్ళ చమాటలొచ్చే

____________________________________________________________

గాయకులు : రైల్రే గంగా
సాహిత్యం: మంకోట ప్రసాద్
సంగీతం: గల్ నామ్‌దేవ్

ఇటువంటి మరిన్ని లిరిక్స్ కోసం తెలుగు రీడర్స్ లిరిక్స్ ను చూడండి.

You may also like

Leave a Comment