Home » ‘విశ్వంభర’ సినిమా డబ్బింగ్ పనులు ప్రారంభం

‘విశ్వంభర’ సినిమా డబ్బింగ్ పనులు ప్రారంభం

by Shalini D
0 comments

వశిష్ఠ డైరెక్షన్‌లో చిరంజీవి హీరోగా నటిస్తున్న విశ్వంభర మూవీ డబ్బింగ్ పనులు ఇవాళ ప్రారంభమయ్యాయి. మెగాస్టార్ డబ్బింగ్ చెబుతుండటం, స్క్రిప్ట్‌ బుక్‌కు పూజలు నిర్వహించిన ఫొటోలు సోషల్ మీడియాలో వైరలవుతున్నాయి. దాదాపుగా మూవీ షూటింగ్ కంప్లీట్ అయినట్లు తెలుస్తోంది. పోస్ట్ ప్రొడక్షన్, VFX పనులు కొనసాగుతున్నాయి. కాగా వచ్చే ఏడాది జనవరి 10న ఈ చిత్రం విడుదల కానుంది.

టాలీవుడ్ లెజెండరీ హీరో మెగాస్టార్ చిరంజీవి హీరోగా త్రిష హీరోయిన్ గా దర్శకుడు వశిష్ట తెరకెక్కిస్తున్న భారీ చిత్రం “విశ్వంభర” కోసం అందరికీ తెలిసిందే. మరి ఈ చిత్రం మెగాస్టార్ కెరీర్ లో 156వ సినిమాగా అత్యంత ప్రతిష్టాత్మకంగా తెరకెక్కిస్తున్నారు. ఇక ఇదిలా ఉండగా ఈ చిత్రం విషయంలో అయితే మెగా ఫ్యాన్స్ చాలా ఎగ్జైటెడ్ గా ఎదురు చూస్తుండగా,

ఈ సినిమా షూటింగ్ సంబంధించి లేటెస్ట్ అప్డేట్ తెలుస్తుంది. దీని ప్రకారం ప్రస్తుతం చిరు అలాగే యంగ్ హీరోయిన్ ఆషికా రంగనాథ్ నడుమ కొన్ని కీలక సన్నివేశాలని వశిష్ట తెరకెక్కిస్తున్నాడని తెలుస్తుంది. సినిమాలో ఈ సీక్వెన్స్ సీన్ కీలకంగా మారుతుంది అని టాక్.

ఇక ఈ భారీ సినిమాని విజువల్ వండర్ లా తెరకెక్కిస్తుండగా ఈ సినిమా సినిమాటోగ్రాఫర్ చోటా కే నాయుడు కి జన్మదిన శుభాకాంక్షలు మేకర్స్ తెలిపారు. ఇక ఈ చిత్రానికి కీరవాణి సంగీతం అందిస్తుండగా యూవీ క్రియేషన్స్ వారు నిర్మాణం వహిస్తున్న సంగతి తెలిసిందే. అలాగే వచ్చే ఏడాది జనవరి 10కి సినిమాని తీసుకొస్తున్నట్టుగా కన్ఫర్మ్ చేశారు.

మరిన్ని సమాచారాల కోసంతెలుగు రీడర్స్ సినిమాను సందర్శించండి.

You may also like

Leave a Comment