Home » కేరళ  స్టైల్ లో దమ్ బిర్యానీ చేసేయండి

కేరళ  స్టైల్ లో దమ్ బిర్యానీ చేసేయండి

by Nikitha Kavali
0 comment

మన  అందరికి బిర్యానీ  అంటే చాల ఇష్టం. ఎన్ని సార్లు తిన్న మళ్ళి మళ్ళి తినాలి అనిపిస్తూ ఉంటుంది. మనం ఎన్నో రకాల బిర్యానీలు తిని ఉంటాం వాటిలో దమ్ బిర్యానీ మన అందరి ఫేవరెట్. దమ్ బిర్యానీ ఎప్పుడు హైదరాబాద్ స్టైల్ లో చేస్తూ ఉంటాం కానీ ఎప్పుడైనా కేరళ స్టైల్ దమ్ బిర్యానీ నీ ట్రై చేసేరా. ఇప్పుడు కేరళ స్టైల్ లో దమ్ బిర్యానీ నీ ఎలా చేయాలో చూసేద్దాం రండి.

కావలసినవి:

ఈ బిర్యానీ నీ తయారు చేయడానికి మనం కొబ్బరి పాలు, గ్రీన్ పేస్ట్ ను తయారు చేసుకోవాలి మరియు బిర్యానీ సామాన్లు.

గ్రీన్ పేస్ట్ తయారీ కి కావలసినవి:

పొదీనా: ½ కట్ట

కొత్తిమీర: 1 కట్ట

స్పినాచ్: ½ కట్ట

పచ్చి మిర్చి: 5

బిర్యానీ కి కావలసినవి:

నూనె: 35 గ్రా

నెయ్యి: 50 గ్రా 

ఎర్రగడ్డలు: 2 మీడియం సైజు

క్యారెట్: 1 

ఆలుగడ్డ: 1

బీన్స్: 100  గ్రా 

అల్లం పేస్ట్: 30గ్రా 

పసుపు:1 టేబుల్ స్పూన్ 

సాల్ట్: రుచికి సరిపడా 

ధనియాల పొడి: 2 టేబుల్ స్పూన్ల 

బిర్యానీ మసాలా: 2 టేబుల్ స్పూన్ల 

గ్రీన్ పేస్ట్

కొబ్బరి పాలు: 150 గ్రా

రైస్: 500 గ్రా

బిర్యానీ ఆకులు: రెండు 

చెక్క: 1

లవంగాలు: 8

యాలకులు: 6

తయారీ  విధానం:

ఈ బిర్యానీ ని తయారు చేయడానికి ముందుగా గ్రీన్ పేస్ట్ ను తయారీ చేసి పక్కన పెట్టుకుందాం. దాని కోసం  ముందు గా స్టవ్ మీద నీళ్లను వేడి చేయండి. ఇప్పుడు ఆ మరుగుతున్న నీళ్లల్లో సుబ్రాంగా కడిగిన పొదినా, కొత్తిమీర, పాలకూర ను ఆ నెలల్లో వేసి 5 నిమిషాల పాటు మీడియం మంటలో ఉడికించండి. ఇక ఆ నెలల్లో నుంచి ఈ కొత్తిమీర, పొదినా, పాలకూర ను  పక్కకు తీసి చల్లార్చండి. ఇప్పుడు అవి బాగా చల్లారాక 5 పచ్చిమిర్చి ని తీసుకొని మెత్తగా అయ్యేవరకు మిక్సీ లో తిప్పండి. ఈ పేస్ట్ ను తాహేసి పక్కన ఉంచండి. 

ఇప్పుడు కొబ్బరి పాలను తాయారు చేసుకుందాం. కొబ్బరి పాలు తయరు చేయడానికి ఒక కొబ్బరి కాయను తీసుకొని చిన్న ముక్కలుగా చేసుకోండి. ఇప్పుడు ఈ కొబ్బరి కాయ ముక్కలను  మిక్సీ లో వేసి కొన్ని నీళ్లు పోసి బాగా గ్రైండ్ చేయండి. ఒక పల్చటి గుడ్డను తీసుకొని ఆ కొబ్బరి పాలను వడకట్టండి. ఇప్పుడు ఈ కొబ్బరి పాలను తీసి పక్క ఉంచండి.

ఇప్పుడు బిర్యానీ చేయడానికి ముఖ్యమైన విధానాన్ని మొదలు పెట్టేద్దాం. ముందుగా ఒక బిర్యానికి చేసే పాత్రను తీసుకొని అందులో నూనె వేసి కొద్దిగా కాగనివ్వండి. నూనె  వేడి అయ్యాక అందులో సన్నగా తరిగిన ఎర్రగడ్డలు, సాల్ట్ వేసి కొంచెం సేపు వేయించండి. తర్వాత మిగిలిన కూరగాయలు(క్యారట్, ఆళ్లగడ్డ, బీన్స్), రుచికి సరిపడే సాల్ట్  వేసి మీడియం మంటలో ఉడకనివ్వండి. అవి కొద్దిగా ఉడికాక అల్లం వెల్లుల్లి పేస్ట్, పసుపు, ధనియాల పొడి, బిర్యానీ మసాలా వేసి లైట్ గ కలిపి 6 నిమిషాల పాటు మీడియం మంటలో ఉడికించండి. ఇప్పుడు మనం ముందుగా తయారు చేసి పెట్టుకున్న గ్రీన్ పేస్ట్ ను వేసి కొంచెం సేపు ఉడకనివ్వండి. తర్వాత మళ్ళి కొబ్బరిపాలు పోసి 5 నిముషాలు ఉడికించండి.

దమ్ బిర్యానీ రైస్ ను సెపరేట్ గ ఉడకబెట్టాలి కాబట్టి ముందుగా నే నానబెట్టుకున్న బియ్యం నీళ్లు వంపేసి  పెట్టుకోండి. ఇప్పుడు అన్నం ఉడికించడానికి ముందు గా మీరు తీసుకున్న బియ్యం కు సరిపడా నీళ్లను తీసుకొని దాంట్లో బిర్యానీ ఆకులు, దాల్చిన చెక్క, లవంగాలు, యాలకులు వేసి ఆ నీళ్ళని బాగా మరిగించండి. మరుగుతున్న ఆ నీళ్లల్లో నానబెట్టి పక్కన పెట్టుకున్న బియ్యం ను వేసి 70% వరకు ఉడికించండి. ఇప్పుడు ఆ 70% ఉడికిన అన్నం నుండి పూర్తి గా నీళ్లను వంచేసి పక్కన పెట్టేసుకోండి. 

ఇక దమ్ బిర్యానీ పూర్తి అవ్వడానికి చివరగా మీరు ముందుగా చేసుకున్న బిర్యానీ గ్రేవీ నీ ఇప్పుడు ఉడకబెట్టుకున్న అన్నం ని ఒక్కొక్క లేయర్స్ గా వేసి పెట్టేసుకొని పైన వేయించుకున్న ఎర్రగడ్డలను పైన వేయండి.  ఇప్పుడు ఆ పాత్రను ఆవిరి పోకుండా గట్టిగ మూత తో కవర్ చేసేయండి. మంటను మీడియం లో  పెట్టి 20 నిమిషాల పాటు ఉడకనివ్వండి. స్టవ్ ఆపేసి 10 నిముషాలు దానిని అలానే పక్కనే ఉంచి వడ్డించేయండి. దీని రుచికి తిన్న ప్రతిఒక్కరు కచ్చితంగా ఫిదా అసివ్వాల్సిందే.

మరిన్ని వాటి కోసం తెలుగు రీడర్స్ వంటలు ను సందర్శించండి.

You may also like

Leave a Comment