Home » ఇంట్లోనే సులభంగా కోల్డ్ కాఫీ తయారీ విధానం | Cold Coffee Making Process in Home

ఇంట్లోనే సులభంగా కోల్డ్ కాఫీ తయారీ విధానం | Cold Coffee Making Process in Home

by Vinod G
609 views
cold coffee making process in home

ఒక చల్లటి కోల్డ్ కాఫీ అనేది ఒత్తిడిని తగ్గించి, మనసును ఉల్లాసంగా మార్చే పానీయం. మనం కేఫ్‌కి వెళ్లకుండానే, ఇంట్లోనే రుచికరమైన కోల్డ్ కాఫీ తయారు చేసుకోవచ్చు. ఇప్పుడు ఎలా తయారు చేసుకోవాలో ఏమేమి కావాలో చూద్దాం!

కోల్డ్ కాఫీ (Cold Coffee) – అవసరమైన పదార్థాలు (Required Ingredients) (1-2 గ్లాసులకి)

  • ఇన్‌స్టంట్ కాఫీ పొడి – 2 టీస్పూన్లు
  • చక్కెర – 2 టీస్పూన్లు (తీపి రుచికి అనుగుణంగా పెంచోచ్చు/తగ్గించొచ్చు)
  • పాలు – 1 కప్పు (కాచి చల్లార్చిన  పాలు)
  • ఐస్ క్యూబ్స్ – 5-6
  • వెనిలా ఐస్ క్రీమ్ – 1 స్కూప్ (రుచికి స్పెషల్ టచ్ కొరకు )
  • చాక్లెట్ సిరప్ – అలంకరణ కోసం

కోల్డ్ కాఫీ (Cold Coffee) – తయారీ విధానం (Making Process):

  1. ముందుగా ఒక బ్లెండర్ తీసుకోని అందులో ఐస్ క్యూబ్స్ వేసుకోండి.
  2. తరువాత కాఫీ పొడి, చక్కెర, పాలు కలపండి.
  3. ఆ తరువాత ఒక స్కూప్ వెనిలా ఐస్ క్రీమ్ వేసి బాగా బ్లెండ్ చేయండి (1-2 నిమిషాల పాటు).
  4. క్రీమీగా, ఫ్రోతీగా మారితే మీ కోల్డ్ కాఫీ రెడీ.
  5. గ్లాస్‌లో చాక్లెట్ సిరప్‌తో అలంకరించండి.
  6. బ్లెండ్ చేసిన కాఫీని గ్లాస్‌లో పోసి, పైన ఇంకొంచెం ఐస్ క్రీమ్ లేదా చాక్లెట్ గ్రేటింగ్ వేసుకోవచ్చు.

మన రుచికి తగ్గట్టుగా కోల్డ్ కాఫీ (Cold coffee to our taste):

  • పాలు వద్దనుకుంటే బాదం పాలు లేదా సోయా పాలని ఉపయోగించవచ్చు.
  • ఇంకా కాఫీ ఫ్లేవర్ కావాలంటే, మొదట కాఫీ పొడిని కొద్దిగా వేడి నీటిలో కలిపి వేసితే బాగుంటుంది.
  • చాక్లెట్ లేదా కారామెల్ సిరప్ వేసుకుంటే రుచికి అదనపు మెరుపు ఉంటుంది.

ఇలా ఇంట్లోనే తయారుచేసుకున్న కోల్డ్ కాఫీతో మీరు మునుపెన్నడూ అనుభవించని కొత్త రుచిని ఆస్వాదించొచ్చు. వేసవిలో వేడి నుండి ఉపశమనం కావాలన్నా, వర్షపు రోజుల్లో చల్లని మజాను అనుభవించాలన్నా – ఈ కోల్డ్ కాఫీ సరైన ఎంపిక. ఇక ఆలస్యం ఎందుకు? మీరు కూడా కోల్డ్ కాఫీ ట్రై చేసి, మీ ఫ్యామిలీతో, ఫ్రెండ్స్‌తో షేర్ చేయండి!


👉 ఇంకా ఇటువంటి వాటి కోసం తెలుగురీడర్స్ ని ఫాలో అవ్వండి ! అలాగే మీకు నచ్చిన వంటకం ఏదైనా ఉంటే కామెంట్లో పేరు చెప్పండి – మేము దాన్ని త్వరగా మీకు అందించే ప్రయత్నం చేస్తాం!

You may also like

Leave a Comment

Adblock Detected

Please support us by disabling your AdBlocker extension from your browsers for our website.