గుండెల్లో.. ఏముందో.. కళ్ళళ్ళో.. తెలుస్తోందీ

పెదవుల్లో.. ఈ మౌనం.. నీ పేరే.. పిలుస్తోందీ

నిలవదు కద హ్రుదయం.. నువు ఎదురుగ నిలబడితే

కదలదు కద సమయం.. నీ అలికిడి వినకుంటే

కలవరమో.. తొలివరమో.. తెలియని తరుణమిదీ

గుండెల్లో.. ఏముందో.. కళ్ళళ్ళో.. తెలుస్తోందీ

పెదవుల్లో.. ఈ మౌనం.. నీ పేరే.. పిలుస్తోందీ

మనస.. మనస.. మనస.. హో మనసా

పువ్వులో లేనిదీ.. నీ నవ్వులో ఉన్నదీ

నువ్వు ఇప్పుడన్నదీ.. నేను ఎప్పుడూ విననిదీ

నిన్నిలా చూసి పయనించీ.. వెన్నెలే చిన్నబోతోందీ

కన్నూలే దాటి కలలన్నీ.. ఎదురుగా వచ్చినట్టుందీ

ఏమో.. ఇదంతా.. నిజంగా కలలాగే.. ఉందీ

గుండెల్లో.. ఏముందో.. కళ్ళళ్ళో.. తెలుస్తోందీ

పెదవుల్లో.. ఈ మౌనం.. నీ పేరే.. పిలుస్తోందీ

ఎందుకో తెలియనీ.. కంగారు పుడుతున్నదీ

ఎక్కడా జరగానీ.. వింతేమి కాదే ఇదీ

పరిమళం వెంట పయనించే.. పరుగు తడబాటు పడుతోందీ

పరిణయం దాక నడిపించే.. పరిచయం తోడు కోరిందీ

దూరం.. తలొంచీ.. ముహూర్తం ఇంకేప్పుడొస్తోందీ

గుండెల్లో.. ఏముందో.. కళ్ళళ్ళో.. తెలుస్తోందీ

పెదవుల్లో.. ఈ మౌనం.. నీ పేరే.. పిలుస్తోందీ

నిలవదు కద హ్రుదయం.. నువు ఎదురుగ నిలబడితే

కదలదు కద సమయం.. నీ అలికిడి వినకుంటే

కలవరమో.. తొలివరమో.. తెలియని తరుణమిదీ

మనస.. మనస.. మనస.. హో మనసా

మరిన్ని తెలుగు పాటల సాహిత్యం కొరకు తెలుగు రీడర్స్ ని సందర్శించండి.

Leave a Reply

Your email address will not be published