Home » చిన్ని చిన్ని ఆశా చిన్నదాని ఆశా – రోజా

చిన్ని చిన్ని ఆశా చిన్నదాని ఆశా – రోజా

by Kusuma Putturu
0 comments
chinni-chinni-aasaa-Roja

చిన్ని చిన్ని ఆశ చిన్నదాని ఆశ..

ముద్దు ముద్దు ఆశ ముత్యమంత ఆశ..

జాబిలిని తాకి ముద్దులిడ ఆశ..

వెన్నెలకు తోడై ఆడుకొను ఆశ ..

చిన్ని చిన్ని ఆశ చిన్నదాని ఆశ..

ముద్దు ముద్దు ఆశ ముత్యమంత ఆశ..

జాబిలిని తాకి ముద్దులిడ ఆశ..

వెన్నెలకు తోడై ఆడుకొను ఆశ ..

చిన్ని చిన్ని ఆశ చిన్నదాని ఆశ…

పూవులా నేనే నవ్వుకోవాలి ..

గాలినే నేనై సాగిపోవాలి …

చింతలే లేక చిందులెయ్యాలీ..

వేడుకలలోనా తేలిపోవాలీ..

తూరుపూ రేఖా వెలుగుకావాలి ..

చిన్ని చిన్ని ఆశ చిన్నదాని ఆశ..

ముద్దు ముద్దు ఆశ ముత్యమంత ఆశ..

జాబిలిని తాకి ముద్దులిడ ఆశ..

వెన్నెలకు తోడై ఆడుకొను ఆశ ..

చిన్ని చిన్ని ఆశ చిన్నదాని ఆశ..

ముద్దు ముద్దు ఆశ ముత్యమంత ఆశ…

చేనులో నేనే పైరు కావాలి..

కొలనులో నేనే అలను కావాలి..

నింగి హరివిల్లూ వంచిచూడాలీ..

మంచు తెరలోనే నిదురపోవాలీ..

చైత్ర మాసంలో చినుకు కావాలి..

చిన్ని చిన్ని ఆశ చిన్నదాని ఆశ..

ముద్దు ముద్దు ఆశ ముత్యమంత ఆశ..

జాబిలిని తాకి ముద్దులిడ ఆశ..

వెన్నెలకు తోడై ఆడుకొను ఆశ ..

చిన్ని చిన్ని ఆశ చిన్నదాని ఆశ..

ముద్దు ముద్దు ఆశ ముత్యమంత ఆశ..

మరిన్ని తెలుగు పాటల సాహిత్యం కొరకు తెలుగు రీడర్స్ ని సందర్శించండి.

You may also like

Leave a Comment

About Us

మేము తెలుగు వారికోసం, తెలుగులో తెలుగుని చదివే వారి కోసం, వారికి తెలుగు మీద వున్నా అభిమానాన్ని చూపించడానికి ఒక  అంతర్జాల విశ్లేషణ ప్రదేశమును సృష్టించినాము. అదే తెలుగు రీడర్స్ అను ఈ ప్రదేశములో మేము మీకు కావాల్సిన కథలు, విశ్లేషణలు, పాటల రచనలు (గేయ రచనలు), చూడవలసిన ప్రదేశాలు, తెలుసుకోవలసిన సాంకేతిక పరిజ్ఞానం, చలన చిత్ర విశేషాలతో ఈ మా తెలుగు రీడర్స్ ని నింపి వున్నాము. మీకు ఎటువంటి ఇబ్బందులు వున్నా మామ్మాల్ని సంప్రదించండి ప్రక్కన వున్నా అనుసంధాన అంతర్జాల వనరుని నొక్కండి. తెలుగు రీడర్స్ ని సంప్రదించండి.

@2025 – All Right Reserved. Designed and Developed by MrPKP.