నటీనటులు: విధార్థ్, అమలా పాల్
సంగీతం: డి. ఇమ్మాన్
సాహిత్యం: వెన్నెలకంటి
గాయకులు: షాన్
నిర్మాత: ఉదయనిధి స్టాలిన్
దర్శకుడు: ప్రభు సోలమన్
సంవత్సరం: 2011

maina maina song lyrics

మైనా మైనా గుండెల్లోన గూడు కడితివే
మైనా మైనా మనసే దోచి మంట పెడితివే
చెప్పేయ్ పిల్లా ఏమయ్యింది చెప్పకుండ దాచొద్దే
చూపులతోటి ముళ్ళే గుచ్చి కళ్ళతోటి నవ్వొద్దే

ఈ దూరం నను కాల్చుకు తిన్నది తెలుసా తెలుసా
నువ్వేగా నా ప్రాణం అని నీకలుసా అలుసా
నువులేక ఉండనే లేను నాకోసం వస్తావా
మైనా మైనా

నిన్ను చూసి పిచ్చివాన్నైపోయా
ప్రేమలోన ఉంది ఏదో మాయ
ఆశే నువ్వంటా గుండె శ్వాసే నువ్వంటా
ఆడుకున్నా ఆట పాడుకున్నా పాట
కళ్ళే పాడే వేళ చూపై పొయె మాట
అదిరే నీ పెదవుల నవ్వైపోనా
అరరే నీ కొంగుని నేనైపోనా

మైనా మైనా గుండెల్లోనా గూడు కడితివే
మైనా మైనా మనసే దోచి మంట పెడితివే

వెంట వచ్చు తోడు నేను కానా
వీడలేని నీడ లాగా రానా
నీతో ఉంటానే నీ మాటే వింటానే
మైనా పేరు వింటే ఝల్లంటోంది ప్రాణం
నువ్వే జంట లేక మాటే నాకు మౌనం
చెలియా నీకోసం మేలుకునుంటా
కలవై నువ్వొస్తే నిదురే పోతా

మైనా మైనా గుండెల్లోన గూడు కడితివే
మైనా మైనా మనసే దోచి మంట పెడితివే
చెప్పేయ్ పిల్లా ఏమయ్యింది చెప్పకుండ దాచొద్దే
చూపులతోటి ముళ్ళే గుచ్చి కళ్ళతోటి నవ్వొద్దే

ఈ దూరం నను కాల్చుకు తిన్నది తెలుసా తెలుసా
నువ్వేగా నా ప్రాణం అని నీకలుసా అలుసా
నువులేక ఉండనే లేను నాకోసం వస్తావా
మైనా మైనా….

మరిన్ని పాటల సాహిత్యం కొరకు తెలుగు రీడర్స్ ను సందర్శించండి.

Leave a Reply

Your email address will not be published