Home » ద్యాల్టోవ్ పాస్.. ప్రపంచానికి తెలియని పరమ రహస్యం!

ద్యాల్టోవ్ పాస్.. ప్రపంచానికి తెలియని పరమ రహస్యం!

by Shameena Shaik
0 comment

చరిత్ర మనకు ఎన్నో పాఠాలు నేర్పుతుంది. ఒకరు చేసిన తప్పులు మరొకరు చెయ్యకుండా అప్రమత్తం చేస్తుంది. ముఖ్యంగా రష్యాలో జరిగిన ఆ ఘటన ఇప్పటికీ సెన్సేషనే. ఒకే ఒక్క రోజులో అంతా అల్లకల్లోలం అయిపోయింది. అసలేం జరిగిందంటే. 1959 ఫిబ్రవరి 1. రష్యాలోని ద్యాత్లోవ్ పాస్ (dyaltov pass). చుట్టూ దట్టమైన మంచుపర్వతాలు. మధ్యలో కనుమ లాంటి లోయ దారి. ఆ పర్వతాల్ని ఎక్కేందుకు 9 మంది పర్వతారోహకులు బయల్దేరారు. వారంతా ద్యాత్లోవ్ పాస్ చేరుకున్నారు. అక్కడి వాతావరణం ఏమాత్రం బతికేందుకు వీలుగా లేదు. రక్తం గడ్డకట్టేసేంత చలి ఊపిరాడనివ్వదు. అలాంటి చోట పర్వతాలు ఎక్కడం సంగతి అలా ఉంచితే. అసలు అక్కడికి వెళ్లడమే కష్టం. కానీ ఆ యువకులు అక్కడికి వెళ్లగలిగారు. అదే ఈ ఘటనలో మిస్టరీకి పునాది వేసింది.

dyaltov pass mistery

ఎన్నో కష్టాలు పడి, కాళ్ల షూస్ కూరుకుపోయే మంచులో అక్కడి దాకా వెళ్లిన ఆ 9 మంది. ఆ రాత్రి అక్కడ క్యాంప్ పెట్టారు. తమతో తెచ్చుకున్న ఆహారాన్ని వేడి చేసి తిన్నారు. తర్వాత టెంట్లలో నిద్రపోయారు. ఆ రాత్రి ఏం జరిగిందో ప్రపంచానికి తెలియదు. కానీ జరిగింది మాత్రం తలచుకోవడానికి కూడా భయపడేంత విషాదకర ఘటన. ఫిబ్రవరి 26న కొందరు పరిశోధకులు. వారి కోసం కోసం అక్కడికి వెళ్లారు. ఆ యువకులు వేసుకున్న టెంట్లను చేరారు. వాటిలో ఎవరూ లేరు. కొన్ని చెంట్లు మధ్యకు చీరేసినట్లుగా ఉన్నాయి. చుట్టుపక్కల ప్రాంతాల్లో యువకుల షూల అచ్చులు ఉన్నాయి. వాటిలో కొన్నింటిలో సాక్స్ ఉన్నాయి. మరికొన్నింటిలో సింగిల్ షూ ఉన్నాయి. కొన్నిచోట్ల పాదాల అచ్చులున్నాయి. 

dyaltov pass mistery

ఆ పాదాల అచ్చుల్ని చూసుకుంటూ. ఆ పరిశోధకులు అలా ముందుకు వెళ్లారు. అక్కడో చిన్న అడవి ఉంది. అక్కడికి వెళ్లినప్పుడు ఇద్దరు కుర్రాళ్ల మృతదేహాలు కనిపించాయి. వారికి షూస్ లేవు. బట్టలు లేవు. అండర్‌వేర్లు మాత్రమే ఉన్నాయి. వారికి హైపోథెర్మియా (hypothermia) సమస్య వచ్చిందేమో అని పరిశోధకులకు డౌట్ వచ్చింది. ఐతే. ఆ రెండు మృతదేహాలకూ పోస్ట్‌మార్టం నిర్వహించినప్పుడు. హైపోథెర్మియా (శరీర ఉష్ణోగ్రతలు పడిపోవడం)తో వారు చనిపోలేదని తేలింది. ఆ తర్వాత కొన్ని నెలలపాటూ వెతకగా. మిగతా 7 డెడ్ బాడీలు కూడా లభించాయి. వాటిలో నాలుగు. చిన్న కాలువలోని నీటిలో ఉన్నాయి. మొత్తం 9 మందిలో ఒక్కరు కూడా హైపోథెర్మియాతో చనిపోలేదని తేలింది. ఓ డెడ్‌బాడీని పరిశీలించినప్పుడు ఎవరో అత్యంత బలంగా కొట్టి చంపినట్లు తెలిసింది. మరో డెడ్‌బాడీపై థర్డ్ డిగ్రీ గాయాలున్నాయి. మరో కుర్రాడు రక్తం కక్కుకున్నాడు. మరో వ్యక్తికి నోట్లో నాలిక లేదు. మరో యువకుడికి పుర్రె బద్దలైంది. మరో ఇద్దరికి రొమ్ములపై బలంగా కొట్టినట్లు గాయాలున్నాయి. రెండు బాడీలకు కళ్లు లేవు. మరో వ్యక్తికి కనుబొమ్మలు లేవు. కొంత మంది బట్టలపై రేడియోయాక్టివ్ మూలకాలు లభించాయి. 

ఒక్క రాత్రిలో వారంతా ఎలా చనిపోయారన్నది మిస్టరీగా మారింది. దీనిపై రకరకాల ఊహాగానాలు వచ్చాయి. మత్తు పదార్థాలు ఎక్కువగా తీసుకొని ఉంటారనీ, గ్రహాంతరవాసులు (Aliens) దాడి చేసి ఉంటారనీ, భూమ్యాకర్షణ శక్తిలో మార్పుల వల్లే ఇలా జరిగిందనీ, మనిషి కంటే పెద్దగా ఉండే యతి (Yeti) అనే జంతువులు దాడి చేసి ఉంటాయనీ, జంతువులు దాడి చేసి ఉంటాయనీ, మంచు తుఫాను వచ్చి ఉంటుందనీ… ఇలా రకరకాల వాదనలు వినిపించాయి. ఓ డాక్యుమెంటరీ ఫిల్మ్‌మేకర.. ఇన్‌ఫ్రాసౌండ్ (infrasound) వల్ల చనిపోయి ఉంటారని చెప్పారు. ఇదేంటంటే. గాలి, టోపోగ్రఫీతో కలుస్తుంది. దాంతో మనం వినలేని ధ్వని తరంగాలు ఉత్పత్తి అవుతాయి. వాటిని మనుషులు తట్టుకోలేరు. ఆ తరంగాలు వినపడితే. వికారం, ఆందోళన, చెమటలు పట్టడం, భయం కలగడం, గుండె కొట్టుకునే వేగం పెరగడం, ఊపిరి తీసుకోలేకపోవడం వంటివి లక్షణాలు వస్తాయి. ఇలాంటిది ఏదో జరిగివుండొచ్చని అనుమానించారు. కచ్చితంగా ఏమైందనేది మాత్రం మిస్టరీగా మిగిలిపోయింది.

dyaltov pass mistery

ద్యాత్లోవ్ పాస్ ఘటన ఆధారంగా. డెవిల్స్ పాస్ (Devil’s Pass) అనే హాలీవుడ్ సినిమా వచ్చింది. అందులో కూడా కచ్చితంగా ఏమైందో చెప్పే ప్రయత్నం చెయ్యలేకపోయారు. దాని బదులు హర్రర్, థ్రిల్లర్ సినిమాలా, మనుషుల లాంటి వింత జీవులు దాడి చేసినట్లు చూపించారు. ఈ ఘటనపై 2019లో రష్యా ప్రభుత్వం మరోసారి దర్యాప్తు జరిపించింది. 2020 జులైకి అది ముగిసింది. మంచు తుఫాను (slab avalanche) వల్లే చనిపోయారని దర్యాప్తు బృందం తేల్చింది. తుఫాను వచ్చినప్పుడు వారంతా టెంట్లు వదిలి పరుగులు పెట్టారనీ. ఆ సమయంలో వారు సరైన బట్టలు కూడా వేసుకోలేదని దర్యాప్తు బృందం అంచనా వేసింది. అలా అడవి దగ్గరకు పారిపోయిన వారి శరీర ఉష్ణోగ్రతలు పడిపోవడం (hypothermia)తో వారు చనిపోయారని తేల్చారు. నిజంగా ఏం జరిగిందో ఎవరికీ తెలియదు.

You may also like

Leave a Comment