హాయ్ తెలుగు రీడర్స్ ! ఎప్పుడెప్పుడా, అని వెయిట్ చేస్తున్న మన తెలుగు సినిమా గం గం గణేశా OTT లోకి వచ్చేసిందండోయ్, మే 31న థియేటర్లలో రిలీజైన గం గం గణేశా మూవీ ఇరవై రోజుల గ్యాప్‌లోనే ఓటీటీలోకి వచ్చేసిందండోయ్. ఈ క్రైమ్ కామెడీ మూవీ థియేటర్లలో పాజిటివ్ టాక్‌ను సొంతం చేసుకున్నది. గణేష్‌గా ఆనంద్ దేవరకొండ క్యారెక్టర్‌తో పాటు కథలోని కామెడీ, ట్విస్ట్‌లు బాగున్నాయంటూ ఆడియెన్స్ నుంచి ప్రశంసలు వచ్చాయి.
ఆనంద్ దేవరకొండ హీరోగా నటించిన గం గం గణేశా మూవీ సడెన్‌గా ఓటీటీలోకి వచ్చింది. గురువారం(20-06-2024) నుంచి అమెజాన్ ప్రైమ్ వీడియో ఓటీటీలో ఈ మూవీ స్ట్రీమింగ్ అవుతోంది. ఎలాంటి ముందస్తు సమాచారం లేకుండా డైరెక్ట్‌గా గం గం గణేశా ఓటీటీలోకి వచ్చి తెలుగు ఆడియెన్స్‌ను సర్‌ప్రైజ్ చేసింది. అలాగే త్వరలోనే అమెజాన్ ప్రైమ్‌లో గం గం గణేశా మూవీ తమిళం, మలయాళం, కన్నడ భాషల్లో రిలీజ్ కాబోతున్నట్లు సమాచారం కూడాను.
ఎవరెవరు నటించారంటే?
గం గం గణేశా మూవీలో ఆనంద్ దేవరకొండకు జోడీగా ప్రగతి శ్రీ వాస్తవ, నయన్ సారిక అనే ఇద్దరు హీరోయిన్లుగా నటించారు. జబర్ధస్థ్ ఇమ్మాన్యుయేల్, వెన్నెలకిషోర్, రాజ్ అర్జున్ కీలక పాత్రలు పోషించారు. ఈ సినిమాతో ఉదయ్ బొమ్మిశెట్టి డైరెక్టర్‌గా టాలీవుడ్‌లోకి ఎంట్రీ ఇచ్చాడు. కేదార్ శెలగంశెట్టి, వంశీ కారుమంచి గం గం గణేశా మూవీ ప్రొడ్యూస్ చేశారు.
కథ విషయానికొస్తే
గణేష్ (ఆనంద్ దేవరకొండ) చిన్న చిన్న దొంగతనాలు చేస్తూ బతుకుతుంటాడు. శృతిని (నయన్ సారిక) ప్రాణంగా ప్రేమిస్తాడు. కానీ గణేష్ దగ్గర డబ్బు లేదని అతడి ప్రేమకు బ్రేకప్ చెబుతుంది శృతి. డబ్బున్న మరో యువకుడితో పెళ్లికి సిద్ధపడుతుంది. లవ్ బ్రేకప్‌తో గణేష్ ఎలాగైనా పెద్ద మొత్తంలో డబ్బు సంపాదించాలని నిర్ణయించుకుంటాడు.
డబ్బు సంపాదనలో గణేష్ భాగంగా ఏడు కోట్ల విలువైన ఓ వజ్రాన్ని దొంగతనం చేసే డీల్ కుదుర్చుకుని దొంగతనం చేస్తాడు. అయితే గణేష్ దొంగతనం చేసిన ఆ వజ్రం అనుకోకుండా ఓ వినాయకుడి విగ్రహంలో పడిపోతుంది. ఎమ్మెల్యే కిషోర్ రెడ్డి (రాజ్ అర్జున్) తయారు చేయించిన ఆ విగ్రహం అతడి రాజకీయ ప్రత్యర్థి ఊరిలోకి ఎలా వెళ్లింది?ఈ విగ్రహం నుంచి వజ్రాన్ని గణేష్ ఎలా కొట్టేశాడు? ఈ రాజకీయ గొడవల కారణంగా గణేష్ జీవితం ఎలా చిక్కుల్లో పడింది? అతడి లైఫ్‌లోకి వచ్చిన నీలవేణి (ప్రగతి శ్రీ వాస్తవ) ఎవరు? అన్నదే గం గం గణేశా మూవీ కథ….
మరిన్ని ఇటువంటి OTT ఇన్ఫర్మేషన్ కోసం తెలుగు రీడర్స్ OTT ని సందర్శించండి.