ఏం చేసావో నా మనసు నీదై పోయింది
ఏదేమైనా నిన్ను వదలి రానని అంటుంది
ఏం చేసావో నా ప్రాణం నీ చుట్టే వుంది
ఏదేమైనా జీవితమే నీదని చెబుతుంది
నిను చేరి జతగా ఆడాన సరదాల కెలి…
ఇక చూడు రోజు అయిపోదా సరసాల హోలీ..
నీ ఆలనలో నీ లాలనలో
ఇక నాకన్నా మహారాణి వేరే ఉందా
ఏం చేసావో నా మనసు నీదై పోయింది
ఏదేమైనా నిన్ను వదలి రానని అంటుంది
ఏం చేసావో నా ప్రాణం నీ చుట్టే వుంది
ఏదేమైనా జీవితమే నీదని చెబుతుంది
పాపయల్లే నా ముందు కుదురుగా కూర్చుంటే
పుత్తడి బొమ్మగా నిన్ను దిద్ది దిష్టే తీయ్యనా
పిల్లాడల్లే అల్లరిగా పరుగులు తీస్తుంటే
కళ్ళను మూసి నలుగద్ది లాలలు పోయన
నువ్ నడిచి అలసి పోతుంటే అర చేతుల నిను మూసెను
నువ్ కథలు చెప్పమని అంటే మన కథనే వినిపిస్తాను
ఏ చింత లేదంటు నీ చెంతనుంటే
ఏ భాగ్యం కావలి నాకింతకంటే
ఈ దొరసాని నా అలివేణి
ఇక లోకంలో ఏదైనా పోతే పోనీ
ఏం చేసావో నా ప్రాణం (నీ చుట్టే వుంది )
ఏదేమైనా జీవితమే (నీదని చెబుతుంది )
స్వాతి చినుకుల ముత్యలే దోసిల్లో నింపి
మురిపెము తీరా నీపైన ముద్దుగా చల్లనా
చిరు మేగంలో ఏడేడు రంగులనే తెచ్చి
మరు నిమిషంలో నీచెయ్యి గాజులు చెయ్యన
కను రెప్పలాగా నీవుంటే కనుపాపై నిద్దరోతాను
మునిమాపు వేళా చలి వేస్తే నిన్ను అల్లుకు పోతా నేను
అమావాస్యలు లేవంట నీవెదుట ఉంటే
అమ్మల్లే తినిపిస్త అలిగి నావంటే
ఓ స్నేహితుడా నా సహచరుడా
ఇక నూరేళ్లు నువ్వే నా తోడు నీడ
ఏం చేసావో నా మనసు నీదై పోయింది
ఏదేమైనా నిన్ను వదలి రానని అంటుంది
ఏం చేసావో నా ప్రాణం నీ చుట్టే వుంది
ఏదేమైనా జీవితమే నీదని చెబుతుంది
నిను చేరి జతగా ఆడాన సరదాల కెలి…
ఇక చూడు రోజు అయిపోదా సరసాల హోలీ..
నీ ఆలనలో నీ లాలనలో
ఇక నాకన్నా మహారాణి వేరే ఉందా..
_________________
పాట: ఏం చేసావో నా మనసు (Emchesavo Naa Manasu)
చిత్రం: యజ్ఞం (Yagnam)
నటీనటులు: గోపీ చంద్ (Gopi Chand), సమీరా బెనర్జీ (Sameera Banerjee)
సంగీత దర్శకుడు: మణి శర్మ (Mani Sharma)
లిరిసిస్ట్: సుద్దాల అశోక్ తేజ (Suddala Ashok Teja)
గాయకులు: శ్రేయా ఘోషల్ (Shreya Ghoshal), చరణ్ (Charan)
మరిన్ని ఇటువంటి లిరిక్స్ కోసం తెలుగు రీడర్స్ లిరిక్స్ ను చూడండి.