nidra lechindi mahila lokam song lyrics

లేచింది నిద్ర లేచింది మహిళాలోకం Song Lyrics

by Nikitha Kavali

లేచింది నిద్ర లేచింది మహిళాలోకం
దద్దరిల్లింది పురుష ప్రపంచం
లేచింది మహిళాలోకం

ఎపుడో చెప్పెను వేమనగారు అపుడే చెప్పెను బ్రహ్మం గారు
ఎపుడో చెప్పెను వేమనగారు అపుడే చెప్పెను బ్రహ్మం గారు
ఇపుడే చెబుతా ఇనుకో బుల్లెమ్మా….
ఇపుడే చెబుతా ఇనుకో బుల్లెమ్మా
విస్సన్న చెప్పిన వేదం కుడా
లేచింది నిద్ర లేచింది మహిళాలోకం

పల్లెటూళ్ళలో పంచాయితీలు పట్టణాలలో ఉద్యోగాలు
పల్లెటూళ్ళలో పంచాయితీలు పట్టణాలలో ఉద్యోగాలు
అది ఇది ఏమని అన్ని రంగముల…
అది ఇది ఏమని అన్ని రంగముల
మగధీరులనెదిరించారు నిరుద్యోగులను పెంచారు
లేచింది నిద్ర లేచింది మహిళాలోకం

చట్టసభలలో సీట్ల కోసం భర్తలతోనే పోటి చేసి
చట్టసభలలో సీట్ల కోసం భర్తలతోనే పోటి చేసి
ఢిల్లీ సభలో పీఠం వేసి..ఆ..ఆ..ఆ.
ఢిల్లీ సభలో పీఠం వేసి
లెక్చరులెన్నో దంచారు విడాకు చట్టం తెచ్చారు

లేచింది నిద్ర లేచింది మహిళాలోకం
దద్దరిల్లింది పురుష ప్రపంచం
లేచింది మహిళాలోకం లేచింది నిద్ర లేచింది మహిళా లోకం

చిత్రం : గుండమ్మ కథ (1962)
సంగీతం : ఘంటసాల,
గీతరచయిత : పింగళి నాగేంద్రరావు
నేపధ్య గానం : ఘంటసాల

మరిన్ని వాటి కోసం తెలుగు రీడర్స్ లిరిక్స్ ను సందర్శించండి.

You may also like