Home » అందానివే అందనివే అందాల అపరంజి బొమ్మ సాంగ్ లిరిక్స్ Folk

అందానివే అందనివే అందాల అపరంజి బొమ్మ సాంగ్ లిరిక్స్ Folk

by Lakshmi Guradasi
0 comments
Andanive andanive andala aparanji song lyrics folk

అందానివే అందనివే
అందాల అపరంజి బొమ్మ
నీ బంగారు కన్నుల్లో హొయలెన్నో పలికేటి
బాపు గీసిన బొమ్మ

ఇందురుడా చందురుడా
వరసైన నా మేన బావ
నీ మాటలతో మంత్రాలు జల్లి
గెలువబోకు వన్నెగాడా

వద్దు వద్దు అంటూ నా మనసునే దోచకే
ముద్దు సరసాలు ఆడి ఏకమైపొదామే
కొంగు పట్టి ఎనక ఎనక ఎంత నువ్వు తిరిగిన
అంతను సెందనురా ఆకతాయి చిన్నోడా

నా అందాల అమ్మడి చెంతకు చేరి రావమ్మా
నీ సవ్వడి వింటే పాణం ఆగిపోతదమ్మా
నా ముద్దుల బావ ఏమయా చేసావు నాకయ్యా
నీ చూపుల దాడికి ఆగమైతిని నేనయ్యా

కోయిలమ్మ పాటలని మాటలతోనే మురిపించినావే
జాబిలమ్మ మెరిసినట్టు విరిసినవే నువ్వు పున్నమి ఓలే
మాటు గాసి మాట గలిపి ముగ్గులో నన్ను దింపకురోయి
కందిరీగోలే నన్ను చుట్టుకుంటూ వెంట వస్తావోయి

నింగిలోని తార జువ్వల నేల మీద నడిచినట్టు
చిత్రమైన మరదల నువ్వంటే నాకు పాణమొట్టు
కొంటే చూపు పిల్లగా చూపుతోనే సైగ చేస్తూ
చెరుకు సెను కాడా నన్ను రమ్మంటావేళరా

అందానివే అందనివే
అందాల అపరంజి బొమ్మ
నీ బంగారు కన్నుల్లో హొయలెన్నో పలికేటి
బాపు గీసిన బొమ్మ

ఇందురుడా చందురుడా
వరసైన నా మేన బావ
ముద్దు మాటలతో మంత్రాలు జల్లి
గెలువబోకు వన్నెగాడా

రాజు గారి కోట నుండి వచ్చినవే నా రాజకుమారి
యుద్దాలైన చేసి నిన్ను గెలువనా నేను రాజ్యానుసారి
గడియకుడా గడవదురా నువ్వు ఒక్కసారైన కనబడకుంటే
చాటుంగా చూస్తూ నిన్ను నాలోనే నేను మురిసిపోతారా

పాలరాతి బొమ్మవే పలికేటి చిలకమ్మ
అల్లుకున్న బంధానివే బతుకంతా నీవేనమ్మా
మనసైన చిన్నోడా మదిలోన నీవేనంతా
నీ చేయి వీడిపోను ఎములాడ దీవెనంతా

అందానివే అందనివే
అందాల అపరంజి బొమ్మ
నీ బంగారు కన్నుల్లో హొయలెన్నో పలికేటి
బాపు గీసిన బొమ్మ

ఇందురుడా చందురుడా
వరసైన నా మేన బావ
ముద్దు మాటలతో మంత్రాలు జల్లి
గెలువబోకు వన్నెగాడా

_______________

నటీనటులు: హన్మంతు. బి, SK రీను
రచయిత: సాయి ఆదిత్
గాయకుడు: బొడ్డు దిలీప్, శైలజ బట్టు
సంగీతం: కృష్ణుడు

మరిన్ని ఇటువంటి లిరిక్స్ కోసం తెలుగు రీడర్స్ లిరిక్స్ ను చూడండి.

You may also like

Leave a Comment

@2025 – All Right Reserved. Designed and Developed by MrPKP.