Home » ‘దేవర’ సినిమానుండి స్పెషల్ వీడియో విడుదల .. సైఫ్ అలీఖాన్ బర్త్ డే కానుక..

‘దేవర’ సినిమానుండి స్పెషల్ వీడియో విడుదల .. సైఫ్ అలీఖాన్ బర్త్ డే కానుక..

by Vinod G
0 comment

జూ ఎన్టీఆర్ అభిమానులకు మరొక గుడ్ న్యూస్ వచ్చేసింగి ! ఇప్పటికే సెకండ్ సింగల్ ‘చుట్టమల్లే’ తో సోషల్ మీడియాలో దుమ్మురేపుతున్న దేవర నుండి మరొక అప్డేట్ వచ్చేసింది. అది ఏంటంటే సినిమా నుండి ఒక ప్రేత్యేక వీడియో రిలీజ్ చేయనున్నట్లు చిత్రబృందం ప్రకటించింది. ఆగష్టు 16 న సైఫ్ అలీఖాన్ బర్త్ డే కానుకగా ఒక స్పెషల్ వీడియో రిలీజ్ చేసారు.

ఇప్పటికే ఫైర్ సాంగ్, చుట్టమల్లే సాంగ్స్ తో సోషల్ మీడియాలో దూసుకుపోతున్న దేవర, ఈ కొత్త వీడియో విడుదలతో మరింత హల్చల్ సృష్టిస్తుందని అర్ధమవుతుంది. ఈ చిత్రానికి కొరటాల శివ దర్శకత్వం వహిస్తున్నారు. అనిరుధ్ బాణీలు సమకూరుస్తున్నారు.

దేవర చిత్రంలో, సైఫ్ అలీఖాన్ పోషించిన పాత్ర భైరా, బలమైన మరియు భయపెట్టే వ్యక్తి. అతను క్రూరమైన మరియు మోసపూరిత విలన్‌గా చూపించబడ్డాడు. ఆ వీడియో లో మాలయుద్ధం చేస్తున్నట్టు, అడవిలో దేనికోసమో వెతుకున్న సన్నివేశాలను చూపించారు. ఈ విధంగా ఆ వీడియో ను బట్టి చిత్రం అనుకున్నంత స్థాయికి చేరుతుందని అర్ధం అవుతుంది.

మరిన్ని ఇటువంటి వాటి కోసం తెలుగు రీడర్స్ సినిమా ను సందర్శించండి.

You may also like

Leave a Comment