Home » సొమ్మసిల్లి పోతున్నవే ఓ చిన్న రాములమ్మ సాంగ్ లిరిక్స్ – జానపద పాట

సొమ్మసిల్లి పోతున్నవే ఓ చిన్న రాములమ్మ సాంగ్ లిరిక్స్ – జానపద పాట

by Vinod G
7.1K views
sommasilli pothunnave o chinna ramulamma folk song lyrics

సొమ్మసిల్లి పోతున్నవే ఓ సిన్న రాములమ్మ
చెమ్మగిల్లి ముధ్దుయ్యవే చూ పించవే నాపై ప్రేమ
నల్ల నల్లని కళ్ళతో నాజూకు నడుముతో నన్నాగమే జేస్తివే
గుండె గాలిలొ తేలుతూ ఆరాటాలాడుతు నీవొళ్ళోనే వాలనే
సుట్టు దిప్పుకున్నావే ఓ చిన్న రాములమ్మ
చెమట చుక్కొల్లే తీసెయ్యకే నీచీర కొంగుకే ముడివెయ్యవే

సాయంకాలం వేళ సందేపోధ్దులాగ సెంతలోనే ఉండవే
చీకటేల మెరిసే సుక్కలాగ గుండెలోన ధాగవే
నీటిలోన నానీడ చూస్తుంటే ఈవేళ నీ బొమ్మలావున్నదే
నీచేతినడ్డేసి కలలన్నీచెరిపేసి కాలాన్ని మార్చకే
ఎక్కడున్నా ఎదురయ్యే నీసన్నజాజి నవ్వులే
సక్కనైన సొగసులే నాకిచ్చి స్వర్గంలో బందించవే

ఏటి గట్టి మీద ఎదురు చూపుల్లోన కళ్ళల్నో నిండినవే
గాలి వానల్లోన గొడుగల్లే రమ్మన్న వెచ్చగా కౌగిలికే
నీ ఊహాలే కన్నా నీ ధ్యాసలో ఉన్నా నాదరికే రమ్మంటినే
నిను వెతికే దారుల్లో అడ్డంకులేన్నున్నా నాఅడుగు నీ జాడకే
ముద్దుగున్నా నా చెలివే ఓ చిన్నా రాములమ్మ
సెంతచేరే రోజెన్నడే ప్రాణం అల్లాడే నీకోసమే

పారేటి సెలయేరు పలుకరించకున్న పరువాలేదనుకుంటినే
ప్రాణం కన్నా నీవు ఎక్కువ అంటున్నా పట్టించుకోవెందుకే
పువ్వుల్లో దాగున్న పరిమళాలన్నీ నీ చెంత చేరిస్తినే
పంచభూతాలన్నీ సాక్షులుగాఉంచేసి మనువాడుకుంటానులే

జన్మజన్మాల బంధానివే ఓ చిన్నా రాములమ్మ
నాసీకటి బ్రతుకుల యెలుగియ్యవే
నా ఇంటి దీపాన్ని ఎలిగించవే


నల్లంచు సీరదేవయ్యె సాంగ్ లిరిక్స్ – జానపద పాట

మరిన్ని ఇటువంటి లిరిక్స్ కోసం తెలుగు రీడర్స్ లిరిక్స్ ను చూడండి.

You may also like

Leave a Comment

Adblock Detected

Please support us by disabling your AdBlocker extension from your browsers for our website.