Home » బ్లడీ ఇష్క్ సినిమా ఈ రోజు ఓటీటీలో విడుదల

బ్లడీ ఇష్క్ సినిమా ఈ రోజు ఓటీటీలో విడుదల

by Shalini D
0 comments
Bloody Ishq movie released today in OTT

బ్లడీ ఇష్క్ చిత్రం థియేటర్లలో రిలీజ్ కాకుండా నేరుగా ఓటీటీలోనే స్ట్రీమింగ్‍కు అడుగుపెట్టనుంది. ఈ హారర్ థ్రిల్లర్ మూవీకి విక్రమ్ భట్ దర్శకత్వం వహించారు. బ్లడీ ఇష్క్ మూవీలో యంగ్ హీరోయిన్ అవికా గోర్, వర్దన్ పూరి ప్రధాన పాత్రలు పోషించారు. జెన్నిఫర్ పిసినాటో, శ్యామ్ కిశోర్ కీలకపాత్రలు చేశారు. ఈ రోజు జూలై 26వ తేదీన డిస్నీ+ హాట్‍స్టార్ ఓటీటీలో స్ట్రీమింగ్‍కు రానుంది. ఇటీవలే ట్రైలర్ రిలీజ్ చేసిన ఆ ప్లాట్‍ఫామ్ స్ట్రీమింగ్ డేట్‍ను వెల్లడించింది.

బ్లడీ ఇష్క్ చిత్రంలో నది మధ్యలో ఐల్యాండ్‍పై ఉండే ఓ భవనంలో ఉండేందుకు అవికా, వర్దన్ వెళతారు. ఈ భవనంలో అవికకు దెయ్యం ఉందని అర్థమవుతుంది. దెయ్యంగా మారిందెవరు.. ఏం జరిగిందనే విషయాలతో ఈ మూవీ స్టోరీ ఉండనుంది. ట్రైలర్‌కు మంచి రెస్పాన్స్ వచ్చింది.

హారర్ చిత్రాలకు ఫేమస్ అయిన డైరెక్టర్ విక్రమ్ భట్ తెరకెక్కించటంతో బ్లడీ ఇష్క్ మూవీపై మంచి అంచనాలు ఉన్నాయి. హరేకృష్ణ మీడియాటెక్, హౌస్‍ఫుల్ మోషన్ పిక్చర్స్ బ్యానర్లు నిర్మించిన ఈ మూవీకి సమీర్ టాండన్, ప్రతీ వాలియా సంగీతం అందించారు.

ఇలాంటి మరిన్ని వాటి కొరకు తెలుగు రీడర్స్ OTT ను సందర్శించండి.

You may also like

Leave a Comment

About us

మేము తెలుగు వారికోసం, తెలుగులో తెలుగుని చదివే వారి కోసం, వారికి తెలుగు మీద వున్నా అభిమానాన్ని చూపించడానికి ఒక అంతర్జాల విశ్లేషణ ప్రదేశమును సృష్టించినాము. అదే తెలుగు రీడర్స్ అను ఈ ప్రదేశములో మేము మీకు కావాల్సిన కథలు, విశ్లేషణలు, పాటల రచనలు (గేయ రచనలు), చూడవలసిన ప్రదేశాలు, తెలుసుకోవలసిన సాంకేతిక పరిజ్ఞానం, చలన చిత్ర విశేషాలతో ఈ మా తెలుగు రీడర్స్ ని నింపి వున్నాము. మీకు ఎటువంటి ఇబ్బందులు వున్నా మామ్మాల్ని సంప్రదించండి ప్రక్కన వున్నా అనుసంధాన అంతర్జాల వనరుని నొక్కండి. తెలుగు రీడర్స్ ని సంప్రదించండి.

@2025 – All Right Reserved. Designed and Developed by MrPKP.