వరుణ్ సందేశ్ హీరోగా నటించిన లేటెస్ట్ క్రైమ్ మిస్టరీ థ్రిల్లర్ మూవీ నింద ఓటీటీలోకి వచ్చేస్తోంది. ఈ మూవీ ద్వారా రాజేష్ జగన్నాథమ్ దర్శకుడిగా టాలీవుడ్‌లోకి ఎంట్రీ ఇచ్చాడు. నింద సినిమాను దర్శకుడే స్వయంగా ప్రొడ్యూస్ చేశాడు. రాజన్న ఫేమ్ అనీ, క్యూ మధు ప్రధాన పాత్రల్లో నటించిన ఈ మూవీ జూన్‌లో థియేటర్లలో రిలీజైంది.
నింద మూవీ తర్వాత విరాజి పేరుతో సస్పెన్స్ థ్రిల్లర్ మూవీ చేస్తోన్నాడు వరుణ్ సందేశ్. ఈ మూవీలో కొత్త లుక్‌లో కనిపించబోతున్నాడు. ఆగస్ట్ 2న విరాజి రిలీజ్ కాబోతోంది. ఆద్యంత్ హర్ష దర్శకత్వం వహిస్తోన్న ఈ మూవీని మైత్రీ మూవీ మేకర్స్ సంస్థ తెలుగులో రిలీజ్ చేస్తోంది. వరుణ్ సందేశ్ హీరోగా నటిస్తోన్న కానిస్టేబుల్ తో పాటు మరో రెండు సినిమాలు సెట్స్ పై ఉన్నాయి.
నింద కథ ఇదే: మంజు (క్యూ మధు) అనే యువతిని రేప్ చేసి చంపేశాడని కాండ్రకోటకు చెందిన బాలరాజును (ఛత్రపతి శేఖర్) పోలీసులు అరెస్ట్ చేస్తారు.పోలీసుల ఇన్వేస్టిగేషన్‌లో బాలరాజు ఈ హత్య చేశాడని ఆధారాలు దొరుకుతాయి. జడ్జి సత్యానంద్ (తనికెళ్లభరణి) అతడికి ఉరిశిక్ష విధిస్తాడు. బాలరాజు నేరం చేయలేదని సత్యానంద్ నమ్ముతాడు. అతడిని ఎలాగైనా నిర్ధోషిగా నిరూపించమని హ్యూమన్ రైట్స్ కమీషన్‌లో పనిచేసే కొడుకును కోరుతాడు.
తండ్రికి ఇచ్చిన మాటను నిలబెట్టుకోవడం కోసం బాలరాజు కేసును రీ ఇన్వేస్టిగేషన్ చేయడం మొదలుపెడతాడు వివేక్. అతడి అన్వేషణలో ఏం తేలింది? నిజంగా బాలరాజే హంతకుండా?ఈ హత్యకు బాలరాజు కూతురు సుధాకు (అనీ) ఏమైనా సంబంధం ఉందా? మంజును ప్రేమించిన మనోహర్ ఎవరు? హంతకులను పట్టుకోవడానికి వివేక్ ఎలాంటి రిస్క్ తీసుకున్నాడు? అన్నదే నింద మూవీ కథ.
ఇలాంటి మరిన్ని వాటి కొరకుతెలుగు రీడర్స్ OTTను సందర్శించండి.