Home » ‘దేవర’ సినిమా అప్‌డేట్

‘దేవర’ సినిమా అప్‌డేట్

by Shalini D
503 views
Devara movie update

జూనియర్ ఎన్టీఆర్, కొరటాల శివ కాంబినేషన్‌లో వస్తోన్న ‘దేవర’ నుంచి ఓ డైలాగ్ లీక్ అయినట్లు తెలుస్తోంది. ‘సాదాసీదా మగాళ్లు కావాలా.. ఈ ఊరినే ఉప్పొంగించే వీరుడు కావాలా..’ అనే డైలాగ్ సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ఇటీవల డబ్బింగ్ ప్రారంభించగా ఈ డైలాగ్ లీక్ అయినట్లు తెలుస్తోంది. ఈ సినిమా ఈ ఏడాది సెప్టెంబర్ 27న రిలీజ్ కానుంది.

కొరటాల శివ దర్శకత్వంలో.. జూనియర్ ఎన్టీఆర్ తాజాగా నటిస్తున్న చిత్రం దేవర. ఈ సినిమాను రెండు భాగాలుగా విడుదల చేస్తున్న విషయం తెలిసిందే. ఇక మొదటి భాగం ప్రస్తుతం చిత్రీకరణ జరుపుకుంటోంది. ఇప్పటికే ఈ సినిమా షూటింగ్ కి సంబంధించి పలు విషయాలు సోషల్ మీడియాలో వైరల్ అవ్వగా.. ఇప్పుడు సినిమా నుంచి తాజాగా ఒక డైలాగ్ లీక్ అయినట్లు సమాచారం.

‘ సాదాసీదా మగాళ్లు కావాలా.. ఈ ఊరినే ఉప్పొంగించే వీరుడు కావాలా..’ అంటూ ఎన్టీఆర్ చెప్పిన ఒక డైలాగ్ ఇప్పుడు సోషల్ మీడియాలో.. తెగ హల్ చల్ చేస్తోంది. ఈ డైలాగ్ విన్న తర్వాత మాస్ అభిమానులకు ఫుల్ మీల్స్ ఇవ్వబోతున్నారని అయితే స్పష్టం అవుతోంది. డైలాగులతోనే సినిమాపై హైప్  పెంచేసిన చిత్ర బృందం.. మరి సినిమా విడుదల అయ్యాక.. ఎలాంటి విజయాన్ని అందుకుంటుందో చూడాలి. 

మరిన్ని ఇటువంటి వాటి కోసం తెలుగు రీడర్స్ సినిమా ను సందర్శించండి.

You may also like

Leave a Comment

Adblock Detected

Please support us by disabling your AdBlocker extension from your browsers for our website.