Home » 7/జి హారర్ మూవీ ఓటీటీలోకి(OTT) స్ట్రీమింగ్ కాబోతోంది

7/జి హారర్ మూవీ ఓటీటీలోకి(OTT) స్ట్రీమింగ్ కాబోతోంది

by Shalini D
0 comment

సోనియా అగర్వాల్ ప్రధాన పాత్రలో నటించిన హారర్ మూవీ 7/జీ ఈ వారంలో ఆహా ఓటీటీలో విడుదల కాబోతోంది. ఈ సినిమా ఆగస్ట్ 9 నుంచి స్ట్రీమింగ్ అవుతుంది. 7/జీ టైటిల్‌తో తెర‌కెక్కిన ఈ మూవీ ఆగ‌స్ట్ 9 నుంచి ఆహా త‌మిళ్ ఓటీటీలో స్ట్రీమింగ్ కాబోతోంది. తెలుగు వెర్ష‌న్ కూడా త్వ‌ర‌లోనే ఆహా ఓటీటీలోనే రిలీజ్ కానున్న‌ట్ల ప్ర‌చారం జ‌రుగుతోంది.

ముఖ్యమైన వివరాలు

  • దర్శకుడు: హరూన్
  • కాస్ట్: సోనియా అగర్వాల్, స్మృతీ వెంకట్
  • ఉత్పత్తి: డ్రీమ్ హౌస్
  • సంగీతం: సిద్దార్థ్ విపిన్
  • విడుదల తేదీ: 2024 ఆగస్టు 9

సినిమా కథ:

ఈ సినిమా కథలో, రాజీవ్ (సిద్ధార్థ్ విపిన్) తన భార్య వర్ష (స్మృతి వెంకట్) కోసం కొత్త అపార్ట్మెంట్‌ను కొనుగోలు చేస్తాడు. వారు 7/జీ అనే ఫ్లాట్‌లో ప్రవేశించిన తర్వాత, రాజీవ్ ఆఫీస్ పనిమీద వెళ్లిపోతాడు. వర్ష ఒంటరిగా ఉండగా, ఆమెకు అనూహ్య పరిణామాలు ఎదురవుతాయి. ఆ ఇంట్లో ఒక దయ్యం ఉన్నట్లు ఆమెకు తెలుస్తుంది. ఈ దయ్యం మంజుల (సోనియా అగర్వాల్) రూపంలో ఉండి, ఆమె చనిపోయి ఎలా దయ్యమైంది అన్నది కథలో కీలకాంశం.ఆమె మ‌ర‌ణానికి కార‌కులు ఎవ‌రు? మంజుల బారి నుంచి త‌న కొడుకును వ‌ర్ష ఎలా కాపాడుతుంది? మంజుల ప‌గ ఎవ‌రిపై అన్న‌దే ఈ మూవీ క‌థ‌. లేడీ ఓరియెంటెడ్ హార‌ర్ మూవీగా ద‌ర్శ‌కుడు హ‌రూన్ ఈ త‌మిళ మూవీని రూపొందించాడు.

ఇలాంటి మరిన్ని వాటి కొరకు తెలుగు రీడర్స్ OTT ను సందర్శించండి.

You may also like

Leave a Comment