Home » విక్టరీ వెంకటేష్ మరియు అనిల్ రావిపూడి కాంబోలో మూడో సినిమా!

విక్టరీ వెంకటేష్ మరియు అనిల్ రావిపూడి కాంబోలో మూడో సినిమా!

by Shalini D
0 comments
venkatesh new movie

విక్టరీ వెంకటేశ్, డైరెక్టర్ అనిల్ రావిపూడి కాంబినేషన్ లో ఓ సినిమా తెరకెక్కనున్న విషయం తెలిసిందే. ఉగాది పండగ సందర్భంగా ‘Venky Anil3’ ‘SVC 58’ వంటి వర్కింగ్ టైటిల్స్ తో ఈ చిత్రాన్ని అధికారికంగా ప్రకటించారు. అదే రోజున వచ్చే సంక్రాంతి రిలీజ్ అంటూ వీడియో వదిలారు. ఇది దర్శక హీరోల కలయికలో రాబోతున్న హ్యాట్రిక్ మూవీ. అందుకే ఎప్పుడెప్పుడు సెట్స్ మీదకు తీసుకెళ్తారా అని అభిమానులు ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. వారి కోసం చిత్ర బృందం తాజాగా షూటింగ్ అప్డేట్ అందించింది.

వెంకీ, అనిల్ రావిపూడిల చిత్రాన్ని ఈ బుధవారం పూజా కార్యక్రమాలతో లాంఛనంగా ప్రారంభించనున్నట్లుగా మేకర్స్ తెలిపారు. “శుభ ముహూర్తాన అద్భుతమైన ప్రయాణానికి నాంది పలకబోతున్నాం. జూలై 3వ తారీఖున ‘వెంకీ అనిల్3 x SVC58’ సినిమా పూజా కార్యక్రమంతో గ్రాండ్ గా లాంఛ్ చేయబోతున్నాం. త్వరలో మీ ముందుకు ఉత్తేజకరమైన అప్‌డేట్‌లు రానున్నాయి” అని సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు. ఈ సందర్భంగా వదిలిన అనౌన్స్ మెంట్ పోస్టర్ ఇంట్రెస్టింగ్ గా ఉంది.

ఇప్పటికే వీరిద్దరి కాంబినేషన్‌లో వచ్చిన రెండు సినిమాలు హిట్ అవ్వగా ముచ్చటగా మూడోసారి జతకట్టనున్నారు. ఈ కొత్త సినిమా పూజా కార్యక్రమంతో రేపు ఉదయం 11.16 గంటలకు లాంఛనంగా ప్రారంభంకానుంది. SVC బ్యానర్‌లో రాబోతున్న 58వ సినిమాను శిరీశ్ నిర్మించనున్నారు.

మరిన్ని సమాచారాల కోసం తెలుగు రీడర్స్ సినిమా ను సందర్శించండి.

You may also like

Leave a Comment

About Us

మేము తెలుగు వారికోసం, తెలుగులో తెలుగుని చదివే వారి కోసం, వారికి తెలుగు మీద వున్నా అభిమానాన్ని చూపించడానికి ఒక  అంతర్జాల విశ్లేషణ ప్రదేశమును సృష్టించినాము. అదే తెలుగు రీడర్స్ అను ఈ ప్రదేశములో మేము మీకు కావాల్సిన కథలు, విశ్లేషణలు, పాటల రచనలు (గేయ రచనలు), చూడవలసిన ప్రదేశాలు, తెలుసుకోవలసిన సాంకేతిక పరిజ్ఞానం, చలన చిత్ర విశేషాలతో ఈ మా తెలుగు రీడర్స్ ని నింపి వున్నాము. మీకు ఎటువంటి ఇబ్బందులు వున్నా మామ్మాల్ని సంప్రదించండి ప్రక్కన వున్నా అనుసంధాన అంతర్జాల వనరుని నొక్కండి. తెలుగు రీడర్స్ ని సంప్రదించండి.

@2025 – All Right Reserved. Designed and Developed by MrPKP.