Home » రెండు కాకులు – నీతి కథ

రెండు కాకులు – నీతి కథ

by Shalini D
0 comments

ఒకసారి రెండు కాకులు గోలు మరియు బోలు ఒక అడవిలో నివసిస్తున్నాయి. గోలు కొంచుం ఉషారుగా ఉంటుంది. బోలు చాలా నిజాయితీగా, సూటిగా ఉంటుంది. రెండు కాకులు తమలో ఎవరు మంచివారు? అని వాగ్వాదానికి దిగాయి. నేను మీకన్నా బలంగా ఉన్నాను, కాబట్టి నేను ఉన్నతమైనదానిని అని గోలు చెప్పుతుంది. బోలు “ కాదు నేను మీకన్నా పెద్దదానిని, కాబట్టి నేను ఉన్నతమైనదానిని,” అని అంటుందిమనద్దరిలో నింపిన బస్తాను ఎక్కువ ఎత్తుకు ఎగురుతు తీసుకెళ్లిన వారు ఉత్తమమని వారు తమలో తాము అనుకోని ఒక పోటీని కొనసాగించారు. గోలు ఉషారుగా వ్యవవారించింది. అది తన సంచిని పత్తితో నింపింది. అదేవిధంగా బోలు తన సంచిని ఉప్పుతో నింపింది. రెండు కాకులు తమ సోంత బస్తాలతో ఎగురడం మొదలుపెట్టాయి.

గోలు సంచిలో పత్తి ఉన్నందున తను ఎత్తులో ఎగురుతోంది. బోలు సంచిలో ఉప్పుతో నిండిన తన సంచితో క్రిందిన ఎగురుతోంది. కానీ అది ఇంకా పైకి ఎగరడానికి ప్రయత్నిస్తుంది. అపుడు భారీగా వర్షం పడిటం మొదలైంది. వర్షం కారణంగా పత్తి బరువుగా మారింది, మరియు ఉప్పు కరుగుతూ తక్కువ బరువు అవుతుంది. ఇప్పుడు బోలు గోలు కన్నా పైన ఎగురుతుంది. కాసేపటికి వాటి పోటీలో బోలు విజయం సాధించింది.

ఈ కథ యొక్క నీతి: మనం నిజాయితీగా, తెలివితో ఆలోచించి పని చేయాలి. అబద్ధాలు చెప్పడం లేదా మోసం చేయడం వల్ల చివరికి మనకు నష్టం జరుగుతుంది. నిజాయితీ మరియు నిజమైన నైపుణ్యాలు ఎప్పుడూ విజయం సాధిస్తాయి.

మరిన్ని ఇటువంటి వాటి కోసం తెలుగు రీడర్స్ నీతి కథలును చూడండి.

You may also like

Leave a Comment