Home » సజల్ అలీ పాకిస్థానీ నటి బయోగ్రఫీ, ఫొటోస్…

సజల్ అలీ పాకిస్థానీ నటి బయోగ్రఫీ, ఫొటోస్…

by Lakshmi Guradasi
0 comments

సజల్ అలీ ఒక పాకిస్థానీ నటి మరియు మోడల్, ఈమె 2009 లో పరిశ్రమలోకి వచ్చింది. జనవరి 17, 1994న పాకిస్తాన్‌లోని లాహోర్‌లో జన్మించింది. ఈమె సిస్టర్, సబూర్ అలీ కూడా యాక్టరే. సజల్ అలీ తల్లి “రహత్” 2017లో క్యాన్సర్‌తో మరణించారు.

సజల్ అలీ 2009లో జియో TV సిట్‌కామ్ లో “నాదానియన్”తో తన కెరీర్ ని ప్రారంభించింది. అప్పటి నుండి ఈమె అనేక TV షోలో మరియు చిత్రాలలో నటిగా చేసింది. “మెహమూదాబాద్ కీ మల్కైన్,” “యాకీన్ కా సఫర్,” “ఓ రంగేజా,” మరియు “అలీఫ్” వంటి పాత్రలు గుర్తింపు తెచ్చాయి. 2017లో “మామ్” సినిమాతో బాలీవుడ్‌లోకి అడుగుపెట్టింది,ఈ సినిమా తన కెరీర్‌లో ముఖ్యమైన సక్సెస్ గా నిలిచింది.

Sajal Aly 1

తన కెరీర్ మొత్తంలో, సజల్ అలీ తన నటనకు అనేక అవార్డులు అందుకుంది. ఆమె ఐదు “హమ్ అవార్డులు” మరియు ఒక లక్స్ స్టైల్ అవార్డును గెలుచుకుంది. ఇండస్ట్రీ లో టాలెంటెడ్ నటిగా ఆమె పేరు తెచ్చుకుంది. ఆమె చేసిన సేవలకు గుర్తింపుగా, పాకిస్థాన్ ప్రభుత్వం ఆమెను తమ్‌ఘా-ఇ-ఇమ్తియాజ్‌తో సత్కరించింది.

తన పర్సనల్ లైఫ్ లో, సజల్ అలీ 2020లో నటుడు “అహద్ రజా మీర్‌”ని వివాహం చేసుకుంది. కానీ కొన్ని కారణాల వలన, వారు 2022లో విడాకులు తీసుకున్నారు. ఆమె తన తల్లిని కోల్పోవడం, తన జీవితం లో జరిగిన ఇబ్బందులు, నటనలో కష్టాలు వంటి వాటి గురించి ఒక వేదికలో చాలా స్పష్టంగా చెప్పింది.

ప్రస్తుతం ఈమె ప్రభాస్ తో కొత్త సినిమా చేస్తునట్టు వార్తలు వస్తున్నాయి. ఆ సినిమా టైటిల్ “ఫౌజి” అని అంటున్నారు. అయితే ఇది అధికారికంగా అనౌన్స్ చేయలేదు. ఇప్పటికే ప్రభాస్ వరుస సినిమాలతో షూటింగ్ లో ఉన్నాడు. సజల్ అలీ కనుక ప్రభాస్ తో సినిమా తీస్తే తన లైఫ్ అంతా మారిపోతుంది, తను కూడా పాన్ ఇండియా నటిగా మారుతుంది.

సజల్ అలీ ఫోటోగ్రఫీ:

Sajal Aly2
Sajal Aly 3
Sajal Aly 5

సజల్ అలీ ఇంస్టాగ్రామ్ అకౌంట్
మరిన్ని ఇటువంటి వంటి వాటి కోసం తెలుగు రీడర్స్ సినిమా ను చుడండి.

You may also like

Leave a Comment