కమ్మని ఈ ప్రేమ లేఖనే రాసింది హృదయమే

ప్రియతమా నీవచట కుశలమా

నేనిచట కుశలమే

ఊహలన్ని పాటలే కనుల తోటలో

తొలి కలల కవితలే మాట మాటలో

ఒహో..కమ్మని ఈ ప్రేమలేఖనే

రాసింది హృదయమే

ప్రియతమా నీవచట కుశలమా

నేనిచట కుశలమే

గుండెల్లో గాయమేమో చల్లంగా మానిపోయే

మాయ చేసే ఆ మాయే ప్రేమాయే

ఎంత గాయమైన గాని నా మేనికేమి గాదు

పువ్వు సోకి నీ సోకు కందేనే

వెలికి రాని వెర్రి ప్రేమ

కన్నీటి ధారలోన కరుగుతున్నది

నాదు శోకమోపలేక

నీ గుండె బాధపడితే తాళనన్నది

మనుషులెరుగలేరు మామూలు ప్రేమ కాదు

అగ్ని కంటే స్వచ్చమైనది

మమకారమే ఈ లాలి పాటగా

రాసేది హృదయమా

ఉమదేవిగా శివుని అర్దభాగమై

నాలోన నిలువుమా

శుభలాలి లాలి జో లాలి లాలి జో

ఉమాదేవి లాలి జో లాలి లాలి జో

మమకారమే ఈ లాలి పాటగా

రాసేది హృదయమా

నా హృదయమా…

మరిన్ని పాటల సాహిత్యం కొరకు తెలుగు రీడర్స్ ని సందర్శించండి. 

Leave a Reply

Your email address will not be published