Home » ఓరి మాయలోడా (Ori Mayaloda) సాంగ్ లిరిక్స్ – Uruku Patela

ఓరి మాయలోడా (Ori Mayaloda) సాంగ్ లిరిక్స్ – Uruku Patela

by Lakshmi Guradasi
0 comments

ఓరి మాయలోడ నిన్ను సూడగానే
గుండె గంతులేసింది
ఓ మాట కూడా నాకు చెప్పకుండా
నిన్ను చుట్టుకుంటుంది
స్కెచి లేమి గీసినావురో సామి
ఉచ్చులోకి లాగినావురో
ఉక్కపోత పెంచినావురో సామి
లొంగిపోతే తప్పులేదురో

ఓరి మాయలోడ నిన్ను సూడగానే
గుండె గంతులేసింది
ఓ మాట కూడా నాకు చెప్పకుండా
నిన్ను చుట్టుకుంటుంది

ఒంటి మీదకెప్పుడొచ్చేనో ఈడు
సోయలేదు ఆడదానన్ని అని
లేనిపోని ఆశాలింకా నాలోకి
దూకుతుంటే అర్ధమయేలే నేను
పైకి కాస్తా బెట్టు చేసినా
లోన లేత కోరికుందిలే
గుంజుకున్న తీపి ముద్దు నీ పేరు
పెదవి మీద రాసుకుందిలే

నాకు ఇన్నాళ్లు రాదంట ప్రేమించడం
నువ్వొచ్చి నేర్పావు జీవించడం
ఇంకా ఎన్నాళ్లు ఊరించి వేధించడం
ముద్దులుంచి అవ్వన సగం

ఓరి మాయలోడ నిన్ను సూడగానే
గుండె గంతులేసింది
ఓ మాట కూడా నాకు చెప్పకుండా
నిన్ను చుట్టుకుంటుంది

పద్ధతైన ఆడపిల్లని నేను
పట్టలేని లేడి పిల్లని
రోజు రోజు రాజుకుంటే నీ మోజు
పట్టు కాస్తా తప్పినానులే
మాటలోన పైకి చెప్పనే లేను
నన్ను ఇంకా ఆపలేను లే
ఇంత బాధ తెచ్చినావు ఓ వైపు
అందులోనే హయ్యి ఉందిలే

నన్ను ఇచ్చేసుకున్నాను
నీకెప్పుడో ఆ మాట తెలిసేది ఇంకెప్పుడో
నువ్వు విన్నవా నా గుండె ఏ చప్పుడో
తెలుసుకోక ఉరుకులేమిటో

ఓరి మాయలోడ నిన్ను సూడగానే
గుండె గంతులేసింది
ఓ మాట కూడా నాకు చెప్పకుండా
నిన్ను చుట్టుకుంటుంది

_____________________________________________________

పాట పేరు: ఓరి మాయలోడా (Ori Mayaloda)
సినిమా పేరు: ఉరుకు పటేల (Uruku Patela)
గాయకుడు: స్పూర్తి జితేందర్ (Spoorthi Jithender)
సాహిత్యం: శ్రీనివాస మౌళి (Srinivasa Mouli)
సంగీత దర్శకుడు: ప్రవీణ్ లక్కరాజు (Pravin Lakkaraju)
దర్శకుడు: వివేక్ రెడ్డి (Vivek Reddy)
నిర్మాత: కంచెర్ల బాల భాను (Kancherla Bala Bhanu)
స్టార్ తారాగణం: తేజుస్ కంచెర్ల (Tejus Kancherla), ఖుష్బూ చౌదరి (Khushboo Choudary)& ఇతరులు

మరిన్ని ఇటువంటి లిరిక్స్ కోసం తెలుగు రీడర్స్ లిరిక్స్ ను చూడండి.

You may also like

Leave a Comment