Home » దుమ్ము రేపుతున్న డబల్ ఇస్మార్ట్ లోని ‘స్టెప్పామార్’ పాట

దుమ్ము రేపుతున్న డబల్ ఇస్మార్ట్ లోని ‘స్టెప్పామార్’ పాట

by Vinod G
0 comment

ఎనర్జిటిక్ స్టార్ రామ్ పోతినేని హీరోగా డాషింగ్ డైరెక్టర్ పూరి జగన్నాధ్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న చిత్రం ‘డబల్ ఇస్మార్ట్’. ఈ చిత్రానికి మణిశర్మ సంగీతం అందించారు. అయితే సోమవారం(1 Jul 2024) ‘స్టెప్పామార్'( SteppaMaar song lyrics telugu) అనే పాటను చిత్రబృందం విడుదల చేసింది. ఈ పాటకి మణిశర్మ సంగీతం ఒక హైలెట్ కాగా దాంతో పాటు రామ్ డాన్సులు మరొక హైలెట్ గా నిలిచాయి. ఈ పాటకు స్టెప్పులేయడమే కాదు.. గొంత కూడా విప్పాడు రామ్. దీంతో ఈ పాట కుర్రకారుకి మరియు డాన్స్ ని ఇష్టపడే వారికి మంచి ఊపును అందిస్తుంది. ఇప్పటికే అత్యధిక వ్యూస్ తో యూట్యూబ్ లో దూసుకు పోతుంది.

రామ్ పోతినేని, పూరి జగన్నాథ్ కాంబినేషన్ లో వచ్చిన ఇస్మార్ట్ శంకర్ ఏ రేంజ్ లో హిట్ అయిందో మనకు తెలుసు. ఇప్పుడా సినిమాకు సీక్వెల్ గా డబుల్ ఇస్మార్ట్ వస్తోంది. పాన్ ఇండియా స్థాయిలో రిలీజ్ కాబోతున్న ఈ మూవీ ఆగస్ట్ 15న రిలీజ్ కానుండగా.. తాజాగా సోమవారం (జులై 1) స్టెప్పామార్ అంటూ ఓ మాస్ సాంగ్ ను చిత్ర యూనిట్ రిలీజ్ చేశారు.

మాస్ బీట్స్‌తో దుమ్ము లేపిన రామ్

ఐదేళ్ల కిందట వచ్చిన ఇస్మార్ట్ శంకర్ మూవీలో టైటిల్ సాంగ్ ఉస్తాద్ ఇస్మార్ట్ శంకర్ సాంగ్ ఓ ఊపు ఊపింది. ఈ మాస్ బీట్స్ కు ఫ్యాన్స్ ఫిదా అయిపోయారు. ఇక ఇప్పుడు డబుల్ ఇస్మార్ట్ నుంచి కూడా అలాంటిదే మరో పాట వచ్చింది. ఇందులోనూ రామ్ పోతినేని తన మాస్ స్టెప్స్ తో అదరగొట్టేశాడు. అంతేకాదు పాటలో గొంతు కూడా విప్పాడు. భాస్కరభట్ల లిరిక్స్ అందించిన ఈ పాట పక్కా హైదరాబాద్ గల్లీల మాస్ బీట్స్ కు అద్దం పడుతోంది. అనురాగ్ కులకర్ణి, సాహితి, రామ్ ఈ పాట పాడారు. ఇస్మార్ట్ శంకర్ టైటిల్ సాంగ్ ఎలా ఊపేసిందో ఇప్పుడీ పాట కూడా అలాగే మాస్ సాంగ్ ఆఫ్ ద ఇయర్ గా నిలుస్తుందని మేకర్స్ భావిస్తున్నారు.

మామూలుగానే డ్యాన్స్ లతో ఇరగదీసే రామ్.. ఈ పాటలోనూ మాస్ స్టెప్పులేశాడు. ఈ మూవీలో రామ్ సరసన కావ్యా థాపర్ ఫిమేల్ లీడ్ గా నటిస్తోంది. సంజయ్ దత్ విలన్ గా నటిస్తుండటం విశేషం. కొంతకాలంగా సరైన హిట్ లేక సతమతమవుతున్నారు రామ్ పోతినేని, పూరి జగన్నాథ్. మరి ఈ ఇద్దరూ కలిసి ఐదేళ్ల కిందట చేసిన మ్యాజిక్ ను ఈ సీక్వెల్ తోనూ రిపీట్ చేస్తారేమో చూడాలి.

చిత్రం: డబుల్ ఇస్మార్ట్
తారాగణం: రామ్ పోతినేని, సంజయ్ దత్, కావ్య థాపర్, బన్ని జె, అలీ, గెటప్ శ్రీను, సాయాజీ షిండే, మకరంద్ దేశ్‌పాండే, టెంపర్ వంశీ తదితరులు
సంగీతం: మణిశర్మ
రైటర్ & దర్శకుడు: పూరి జగన్నాధ్
నిర్మాతలు: పూరి జగన్నాధ్, ఛార్మి కౌర్

మరింత సమాచారాం కోసంతెలుగు రీడర్స్ సినిమాను సందర్శించండి.

You may also like

Leave a Comment