Home » నీది అల్లపు లారీ నీది బెల్లపు లారీ సాంగ్ లిరిక్స్ – జానపద పాట

నీది అల్లపు లారీ నీది బెల్లపు లారీ సాంగ్ లిరిక్స్ – జానపద పాట

by Vinod G
0 comment

నీది అల్లపు లారీ నీది బెల్లపు లారీ
నీది అల్లపు లారీ నీది బెల్లపు లారీ
జర అడ్డమురాకోయ్ పిల్లగా రాఘవరెడ్డి
జర అడ్డమురాకోయ్ పిల్లగా రాఘవరెడ్డి

నీకు కమ్ములజోడు కాళ్లకు కడియాలజోడు
నీకు కమ్ములజోడు కాళ్లకు కడియాలజోడు
ఢిల్లీ గల్లీలకెళ్లి నీకు దేస్థిని మళ్ళీ
ఢిల్లీ గల్లీలకెళ్లి నీకు దేస్థిని మళ్ళీ

నీది తూర్పు తోట నాది శెనిగచేనట
నీది తూర్పు తోట నాది శెనిగచేనట
శెనగచేన్లమాట ఏమా రాఘవరెడ్డి
శెనగచేన్లమాట ఏమా రాఘవరెడ్డి

శెనగతోటదేముందే నాది మాట దేముందే
శెనగతోటదేముందే నాది మాట దేముందే
నీమీద ప్రేమ నాకుందే సేంతకుజేరవే మల్లి
నీమీద ప్రేమ నాకుందే సేంతకుజేరవే మల్లి

నాది కమ్మల గుడిసె నీది బంగుల మెరిసే
నాది కమ్మల గుడిసె నీది బంగుల మెరిసే
మనకు పొంతనగాదోయ్ పోవోయ్ రాఘవరెడ్డి
మనకు పొంతనగాదోయ్ పోవోయ్ రాఘవరెడ్డి

నీది గుడిసేదేముందే గొప్ప మనసునాకుందే
నీది గుడిసేదేముందే గొప్ప మనసునాకుందే
నీకై ప్రాణమే ఇస్తా మాట నమ్మవే మల్లి
నీకై ప్రాణమే ఇస్తా మాట నమ్మవే మల్లి

మనువు ఆడుతానని మాట ఇస్తివినాకు
మనువు ఆడుతానని మాట ఇస్తివినాకు
మాట ఇస్తివి నాకు మాయమైతివి నువ్వు
మాట ఇస్తివి నాకు మాయమైతివి నువ్వు

పట్నంలా పనిజేసి పైకమంత పోగేసి
పట్నంలా పనిజేసి పైకమంత పోగేసి
నీకు నగలే దేస్థి తీసుకోవే ఓ మల్లి
నీకు నగలే దేస్థి తీసుకోవే ఓ మల్లి

నాకు నగలు వద్దోయ్ నాకు నాడలోద్దోయ్
నాకు నగలు వద్దోయ్ నాకు నాడలోద్దోయ్
నన్ను మనువాడోయి ముద్దుగజూసుకోవోయి
నన్ను మనువాడోయి ముద్దుగజూసుకోవోయి

మంచి రోజులుజూసి మనువుజేసుకోని
మంచి రోజులుజూసి మనువుజేసుకోని
కలిసిమెలిసి ఉందం రాయే ముద్దుల మల్లి
కలిసిమెలిసి ఉందం రాయే ముద్దుల మల్లి

కలిసిమెలిసి ఉందం రాయే ముద్దుల మల్లి
కలిసిమెలిసి ఉందం రాయే ముద్దుల మల్లీ…


మా గల్లీల ఒక్కడు పోరడు సాంగ్ లిరిక్స్ – జానపద పాట

మరిన్ని ఇటువంటి లిరిక్స్ కోసం తెలుగు రీడర్స్ లిరిక్స్ ను చూడండి.

You may also like

Leave a Comment