Home » మా గల్లీల ఒక్కడు పోరడు సాంగ్ లిరిక్స్ – జానపద పాట

మా గల్లీల ఒక్కడు పోరడు సాంగ్ లిరిక్స్ – జానపద పాట

by Vinod G
0 comment

మా గల్లీల ఒక్కడు పోరడు
అందగాడడు నన్ను జూత్తడు
నన్ను జూసిన జూడనట్టుంటడు
నవ్వుతుంటడు, కన్నుగొడతడు, సైగ జేత్తడు

వాడు మురిపాల ముద్దుల కృష్ణుడు
తెలివిగల్లోడు తెల్లగుంటడు
నన్ను సాటుకిలిసి ముచ్చటంటడు
ముద్దులంటడు, సరసమంటడు, లొల్లి జేత్తడు

ఇగ పొద్దున్నే మా వాడకత్తడు
కావలుంటడు అడ్డమొత్తడు
నన్ను కాలేజికే బోనీయడు
బండిదెత్తడు, ఎక్కమంటడు, పోదామంటడు

నాకు ఊరు వాడ జూపిత్తడు
జాతరంటడు తొల్కవోతడు
నేనడిగింది నాకు గొనిత్తడు
రాణివంటడు, రాజునంటడు, మురిసిపోతడు

వాడు సక్కని మనసున్న పోరడు
ఊరినిడవడు ఊళ్ళే ఉంటడు
ఈ ఊరంతా నా వోళ్లే అంటాడు
తోడుగుంటడు, సాయమైతడు, సాగిపోతడు

వాడు ఆస్తి పాస్తి దండిగున్నోడు
కాని లేనోడు అన్నట్టుంటడు
అందరితోని గలిసి మెలిసుంటడు
బుద్ధిమంతుడు, సదువుకున్నోడు, సక్కనైనోడు

వాడు సుక్కల్లో మెరిసేటి సెంద్రుడు
కలవ కళ్ళోడు… కాంతి నవ్వోడు
పారాయి అమ్మాయిలని జూడడు
దారి ఇస్తడు, పక్కకెలతడు, పారిపోతడు

మరి నేనంటే పడి సచ్చిపోతడు
నన్ను ఇడవడు, కలవరిత్తడు
వాడు పడుకున్నా… నా పేరే తల్తడు
మొండి గుణమోడు, మాయజేశాడు
మనసు దోశాడు

నా మేనత్త ముద్దుల కొడుకాడూ
వరస అయినోడు మేన బావాడు
నా మెడలోన తాళిగట్టేటోడు
యేలువడతాడు, ఏలుకుంటాడు, తోడుగుంటాడు

నా మేనత్త ముద్దుల కొడుకాడు
వరస అయినోడు మేన బావాడు
నా మెడలోన తాళిగట్టేటోడు
యేలువడతాడు, ఏలుకుంటాడు, తోడుగుంటాడు


మరిన్ని ఇటువంటి లిరిక్స్ కోసం తెలుగు రీడర్స్ లిరిక్స్ ను చూడండి.

You may also like

Leave a Comment