Home » మనసున మనసు నువ్వే ( Manasuna Manasu nuvve )  సాంగ్ లిరిక్స్ – Dhoom Dhaam (Telugu)

మనసున మనసు నువ్వే ( Manasuna Manasu nuvve )  సాంగ్ లిరిక్స్ – Dhoom Dhaam (Telugu)

by Lakshmi Guradasi
0 comments
Manasuna Manasu nuvve Song Lyrics Dhoom Dhaam

సైడ్ ట్రాక్ : సప మప గ గరి నిప ని స ని స
సప మప గ గరి
సప మప గ గరి నిప ని స ని స
సప నిప గ గరి

అతడు: మనస్సున మనస్సు నువ్వే
మరల నన్ను కలిసావే
మరువని తలపుల పై
మరుమల్లెలు కురుసావే

మధురనారి మరొకసారి
దారకుజారి దరికిచేరి
ఎదను సేద తీర్చు దేవతవైనవే…..

ఆమె: గలగల సంబరం కలల నదికి సాగరసంగమం
కలవరమే వరం కడలి మదికి
మధుగారమై ఈ క్షణం

మనస్సున మనస్సు నువ్వే
మరల నన్ను కలిసావే

అతడు: ఆటొక్క క్షణము నువ్వు దూరమైతే
మరి తెలిసే ప్రేమ విలువేమిటో
నిదుర కుదుటపడి నెమ్మదైన మది
వెలిగెనే వెయ్యి కనులతో

ఏది అనుబంధం
ఎవరితో నా బంధం
నేడే కనుగొన్న
ఎచ్చట నా ఆనందం
ఎడబాటు సాక్షిగా
ఎటు వేళ్లను విడిపోవులే

ఆమె: గలగల సంబరం కలల నదికి సాగరసంగమం
కలవరమే వరం కడలి మదికి
మధుగారమై ఈ క్షణం

మనస్సున మనస్సు నువ్వే
మరల నన్ను కలిసావే
మధువుల పెదవుల పై
మరివల్లపుగా మెరిసావే

ఎవరు నువ్వు ఎవ్వరు నేను
అడగమాను తెలుసుకొను
అలాయుగాల ప్రేమ బంధమే మనది…..

సైడ్ ట్రాక్ : సప మప గ గరి నిప ని స ని స
సప మప గ గరి
సప మప గ గరి నిప ని స ని స
సప నిప గ గరి

__________________________________________________

పాట : మనసున మనసు నువ్వే ( Manasuna Manasu nuvve )
సినిమా పేరు: “ధూమ్ ధామ్” (తెలుగు) ( “Dhoom Dhaam” (Telugu) )
సంగీతం: గోపీ సుందర్ ( Gopi Sundar )
సాహిత్యం : “సరస్వతి పుత్ర” రామ జోగయ్య శాస్త్రి ( “Saraswathi Putra” Rama Jogayya sastry )
రచయిత: గోపీ మోహన్ ( Gopi Mohan )
గాయకులు: విజయ్ యేసుదాస్, హరిణి ఇవటూరి ( Vijay Yesudas, Harini Ivaturi )
బ్యానర్ పేరు: ఫ్రైడే ఫ్రేమ్‌వర్క్స్ ప్రై. లిమిటెడ్ ( Friday Frameworks Pvt. Ltd. )
నిర్మాత: M.S. రామ్ కుమార్ ( M.S. Ram Kumar )
దర్శకుడు: మచ్చ సాయికిషోర్ ( Macha Saikishor )
నటీనటులు: చేతన్ కృష్ణ ( Chetan Krishna ), హెబ్బా పటేల్ ( Hebba Patel )

మరిన్ని ఇటువంటి లిరిక్స్ కోసం తెలుగు రీడర్స్ లిరిక్స్ ను చూడండి.

You may also like

Leave a Comment

About Us

మేము తెలుగు వారికోసం, తెలుగులో తెలుగుని చదివే వారి కోసం, వారికి తెలుగు మీద వున్నా అభిమానాన్ని చూపించడానికి ఒక  అంతర్జాల విశ్లేషణ ప్రదేశమును సృష్టించినాము. అదే తెలుగు రీడర్స్ అను ఈ ప్రదేశములో మేము మీకు కావాల్సిన కథలు, విశ్లేషణలు, పాటల రచనలు (గేయ రచనలు), చూడవలసిన ప్రదేశాలు, తెలుసుకోవలసిన సాంకేతిక పరిజ్ఞానం, చలన చిత్ర విశేషాలతో ఈ మా తెలుగు రీడర్స్ ని నింపి వున్నాము. మీకు ఎటువంటి ఇబ్బందులు వున్నా మామ్మాల్ని సంప్రదించండి ప్రక్కన వున్నా అనుసంధాన అంతర్జాల వనరుని నొక్కండి. తెలుగు రీడర్స్ ని సంప్రదించండి.

@2025 – All Right Reserved. Designed and Developed by MrPKP.