Home » ఓ టీ టీ (OTT) లోకి వస్తున్న “డబుల్ ఇస్మార్ట్”

ఓ టీ టీ (OTT) లోకి వస్తున్న “డబుల్ ఇస్మార్ట్”

by Rahila SK
0 comment

పూరి జగన్నాధ్ దర్శకత్వంలో రామ్ పోతినేని, సంజయ్ దత్ నటించిన ఈ చిత్రం హిట్ మూవీ “డబుల్ ఇస్మార్ట్” కు సీక్వెల్. మిశ్రమ సమీక్షలు మరియు నిరాడంబరమైన బాక్సాఫీస్ పనితీరు ఉన్నప్పటికీ, ఈ చిత్రం రాబోయే డిజిటల్ విడుదల కోసం గణనీయమైన ఆసక్తిని కలిగి ఉంది.

ఈ సినిమా థియేట్రికల్ హక్కులు సుమారు 60 కోట్ల రూపాయలకు అమ్ముడైనట్లు సమాచారం. సినిమా విడుదల తరువాత, అది ఓటీటీలో అందుబాటులోకి రానుంది, “డబుల్ ఇస్మార్ట్” సినిమా 2024 ఆగస్టు 15న థియేటర్లలో విడుదలైంది. ఈ సినిమా 45 రోజుల తరువాత, అంటే 2024 సెప్టెంబర్ 29న అమెజాన్ ప్రైమ్ వీడియోలో స్ట్రీమింగ్ కోసం అందుబాటులో ఉంటుంది.

డబుల్ ఇస్మార్ట్ సినిమా కథ 

బిగ్ బుల్ (సంజయ్ దత్) కు బ్రెయిన్ ట్యూమర్ ఉండటంతో, మూడు నెలల్లో చనిపోతానని తెలుసుకుంటాడు. తాను చిరకాలం బతకాలని కోరుకుంటాడు, బిగ్ గోల్‌తో బతకాలని కోరుకుంటాడు. దీని కోసం తన మెమరీ ట్రాన్స్ఫర్మేషన్ కోసం ప్రయత్నాలు మొదలు పెడతాడు. ఇస్మార్ట్ శంకర్ (రామ్ పోతినేని)కి ఆల్రెడీ మెమరీ ట్రాన్స్ఫర్మేషన్ సక్సెస్ అయిందని, తన మెమరీస్ ఇస్మార్ట్ శంకర్లో జొప్పించాలని కోరుకుంటాడు.

బిగ్ బుల్ ఇస్మార్ట్ శంకర్ కోసం తన గ్యాంగ్ను దింపుతాడు. ఇస్మార్ట్ శంకర్ సైతం బిగ్ బుల్ మనీని కొల్లగొడుతుంటాడు. ఈ క్రమంలో జన్నత్ (కావ్యా థాపర్) కూడా ఇస్మార్ట్ శంకర్తో చేతులు కలుపుతుంది. ఇస్మార్ట్ శంకర్ తన టార్గెట్ బిగ్ బుల్ అని చెబుతుంటాడు. బిగ్ బుల్ ఇస్మార్ట్ శంకర్ మెమరీ ట్రాన్స్ఫర్మేషన్ చేసేందుకు చేసిన ప్రయత్నాలు ఏంటి? ఆ ట్రాన్స్ఫర్మేషన్ జరిగిన తరువాత ఏర్పడిన పరిణామాలు ఏంటి? బిగ్ బుల్ను పట్టుకునేందుకు రా ఏం చేసింది? జన్నత్ పాత్ర ఏంటి? పోచమ్మ (ఝాన్సీ) కారెక్టర్కు ఉన్న ఇంపార్టెన్స్ ఏంటి? చివరకు ఏం జరుగుతుందో తెరపై చూడాల్సిందే.

ఇలాంటి మరిన్ని వాటి కొరకు తెలుగు రీడర్స్ OTT ను సందర్శించండి.

You may also like

Leave a Comment