Home » టాలీవుడ్ ఎంట్రీ ఇవ్వబోతున్న ఆస్ట్రేలియన్ క్రికెటర్ డేవిడ్ వార్నర్

టాలీవుడ్ ఎంట్రీ ఇవ్వబోతున్న ఆస్ట్రేలియన్ క్రికెటర్ డేవిడ్ వార్నర్

by Lakshmi Guradasi
0 comments
Australian cricketer David Warner entry into Tollywood

ఆస్ట్రేలియా క్రికెటర్ డేవిడ్ వార్నర్, టాలీవుడ్ సూపర్ హిట్ మూవీ పుష్ప 2: ది రూల్ లో అతిధి పాత్రలో కనిపించనున్నారని జోరుగా ప్రచారం జరుగుతోంది. వార్నర్ టాలీవుడ్ సినిమాలకు పెద్ద అభిమానిగా సుపరిచితుడు. పుష్ప సినిమాలో అల్లూ అర్జున్ పాత్రను అనుకరిస్తూ, సోషల్ మీడియాలో రీల్స్ వందల కొద్దీ పోస్ట్ చేస్తూ వచ్చిన వార్నర్, తెలుగు ప్రేక్షకుల హృదయాలను దోచుకున్నారు.

ఈ పుకార్లు మరింత బలపడ్డాయి, అతను మెల్బోర్న్ లో ఒక సినిమా షూట్ లో పాల్గొన్నట్టు వార్తలు వచ్చిన తర్వాత. షూట్ లో తెల్లని దుస్తులు ధరించి, హెలికాప్టర్లో దిగుతూ, చేతిలో బంగారు తుపాకీ పట్టుకొని అతను కనిపించాడు. కమ్ముకున్న గూండాలపై వార్నర్ యాక్షన్ సీన్ లో పాల్గొన్నాడని సమాచారం ఉంది. ఇవన్నీ పుష్ప 2 లో అతిధి పాత్రలో నటించాడనే ఊహాగానాలకు దారితీశాయి. కానీ ఇప్పటివరకు ఈ విషయంపై అధికారికంగా ఎలాంటి ప్రకటన వెలువడలేదు. క్రికెట్ ఓపెనర్ గా వచ్చి సిక్స్ లు, ఫోర్ లతో అలరిస్తూ పేరు తెచ్చుకున్నాడు. తన టాలెంట్ ను అక్కడితో ఆపకుండా రీల్స్, సినిమా డైలాగులు వంటివి చేస్తూ ఇప్పుడు సినిమా వరకు వచ్చాడు. మరి ఇతని ప్రయాణం ఎంత వరకు చూడాలి.

ఇటువంటి మరిన్ని విషయాల కొరకు తెలుగు రీడర్స్ సినిమా ను చూడండి.

You may also like

Leave a Comment

About us

మేము తెలుగు వారికోసం, తెలుగులో తెలుగుని చదివే వారి కోసం, వారికి తెలుగు మీద వున్నా అభిమానాన్ని చూపించడానికి ఒక అంతర్జాల విశ్లేషణ ప్రదేశమును సృష్టించినాము. అదే తెలుగు రీడర్స్ అను ఈ ప్రదేశములో మేము మీకు కావాల్సిన కథలు, విశ్లేషణలు, పాటల రచనలు (గేయ రచనలు), చూడవలసిన ప్రదేశాలు, తెలుసుకోవలసిన సాంకేతిక పరిజ్ఞానం, చలన చిత్ర విశేషాలతో ఈ మా తెలుగు రీడర్స్ ని నింపి వున్నాము. మీకు ఎటువంటి ఇబ్బందులు వున్నా మామ్మాల్ని సంప్రదించండి ప్రక్కన వున్నా అనుసంధాన అంతర్జాల వనరుని నొక్కండి. తెలుగు రీడర్స్ ని సంప్రదించండి.

@2025 – All Right Reserved. Designed and Developed by MrPKP.