🎬 దర్శకత్వం: మురళీ కిషోర్ అబ్బూరి
🎥 నిర్మాణం: అన్నపూర్ణ స్టూడియోస్ & సితార ఎంటర్టైన్మెంట్స్
💫 నటీనటులు: అఖిల్ అక్కినేని, శ్రీలీల
🗓️ రిలీజ్ డేట్: త్వరలో
అక్కినేని అఖిల్ కొత్త సినిమా ‘లెనిన్’ టైటిల్ గ్లింప్స్ వచ్చేసింది – కేవలం ఒక నిమిషం వీడియో అయినా, వీడియో చూస్తుంటే గూస్ బంప్స్ వచ్చేలా చేస్తుంది!
🎭 అఖిల్ పూర్తి బాధ్యతతో కనిపించాడు, మాస్, ఇంటెన్స్ పాత్రలో. ఈసారి కామర్షియల్ సినిమా కంటే ఆలోచింపజేసే కథను ఎంచుకున్నట్టు తెలుస్తోంది.
NO WAR IS MORE VIOLENT THAN LOVE
ప్రేమ కంటే యుద్ధం ఎక్కువ హింసాత్మకం కాదు
ఇక టైటిల్ విషయానికొస్తే, ‘లెనిన్‘ అనే పేరు సామాజిక బాధ్యత, ప్రజల హక్కుల కోసం పోరాడే యోధుడి పేరు ఇది. టైటిల్ గ్లిమ్ప్స్ చూశాక స్పష్టంగా ఒక విషయం అర్ధమవుతుంది – ఇది మామూలు మాస్ సినిమా కాదు ఒక విలేజ్ లెవెల్ రగ్గుడ్ మాస్ సినిమా అని … దాంతో పాటు ఒక లవ్ స్టోరీ కూడా ట్రావెల్ అయ్యేలా కనపడుతుంది. ఇంకా తండేల్ సినిమాలో మాదిరి పేదవారి కోసం పోరాటం చేసే ఓ విప్లవ కథ! అని కూడా అనిపిస్తుంది. అయితే అక్కినేని బ్రదర్స్ ఇద్దరు బ్లాక్ బాస్టర్స్ కొట్టబోతున్నట్లు తెలుస్తుంది. ఆల్రెడీ తండేల్ తో చైతన్య బ్లాక్ బాస్టర్ కొట్టాడు. ఇక లెనిన్ తో అఖిల్ అంతకన్నా పెద్ద బ్లాక్ బాస్టర్ కొట్టబోతున్నట్లు స్పష్టంగా తెలుస్తుంది.
📸 విజువల్స్: వేరే లెవల్
నేలపై కుర్చీని లాక్కుని వస్తూ … ఆ కళ్లలో ఇది నాది అనే ధీమా కనపడుతూ … గొడ్డలి చేత పట్టుకుని ఒక విప్లవ కారుడు మల్లె యుద్దానికి సిద్ధం అన్నట్లుగా … ఇక “మా నాయిన్న నాకు ఓ మాట సెప్పినాడు పుట్టే టప్పుడు ఉపిరుంటాది రా పేరుండదు, అట్నే పోయేటప్పుడు ఊపిరి ఉండదు పేరు మాత్రమే ఉంటది” అనే డైలాగ్ తో అదరగొట్టేసాడు అని చెప్పవచ్చు. ఇక పూనకాలు లోడింగ్ అంతే…
🔥 అఖిల్ లుక్: అదుర్స్ 🔥
ఇంకా పూర్తిగా చూపించకపోయినా, అఖిల్ అంటే మిల్కీ బాయ్ అనుకునే వారికీ ఒక సరికొత్త సవాల్ విసిరాడు అని చెప్పవచ్చు. ఓ ఇంటెన్స్ విప్లవకారుడు వస్తున్నాడని సంకేతాలు స్పష్టంగా ఉన్నాయి. ఇది అతని కెరీర్‌లో మైల్‌స్టోన్ సినిమా కావచ్చు.
🎶 బీజి ఎం: ఎక్సట్రా
ఛత్రమే పట్టిన కృష్ణుడై కదిలేరా అంటూ బ్యాక్‌గ్రౌండ్ స్కోర్ ఇరగదీసేశాడు.. వేరే లెవల్ అంతే. ఇది సినిమాకి ఎంత వెయిట్ ఉందో చెప్తుంది. థమన్ అదరకొట్టేశాడు…
🌟టాక్ – మ్యూజిక్, విజువల్స్, ఎమోషన్ – అన్ని మిళితమై ఉండే ఈ సినిమా, అఖిల్ కెరీర్‌కు కీలక మలుపు కావొచ్చని టాక్.
✊ లెనిన్ – ఇది ఈ సినిమాతో మొదలయ్యే అక్కినేని అభిమానుల చైతన్యం కావచ్చు.
👉మరిన్ని వాటికోసం తెలుగు రీడర్స్ సినిమాను సందర్శించండి