Home » మిస్టర్ బచ్చన్ మూవీ అప్‌డేట్

మిస్టర్ బచ్చన్ మూవీ అప్‌డేట్

by Shalini D
324 views
Mr. Bachchan movie update

మిస్టర్ బచ్చన్ సినిమా ఓటీటీ డిజిటల్ స్ట్రీమింగ్ డీల్ పూర్తయిందని సమాచారం బయటికి వచ్చింది. ఆగస్టు 15వ తేదీన ఈ చిత్రం థియేటర్లలో రిలీజ్ కానుంది. థియేట్రికల్ రన్ తర్వాత ఓటీటీలోకి వస్తుంది. హక్కులను ఏ ఓటీటీ తీసుకుందంటే.. మాస్ మహారాజ రవితేజ హీరోగా నటిస్తున్న మిస్టర్ బచ్చన్ చిత్రంపై బోలెడు అంచనాలు ఉన్నాయి. రెండేళ్లుగా తన రేంజ్ హిట్ ఆయన దక్కలేదు. మూడు చిత్రాలు నిరాశపరిచాయి.

దీంతో మిస్టర్ బచ్చన్‍పై రవితేజ ఫ్యాన్స్ చాలా ఆశలు పెట్టుకున్నారు. ఇప్పటికే ఈ మూవీ నుంచి వచ్చిన షోరీల్ గ్లింప్స్, పాట ఆకట్టుకున్నాయి. దీంతో బాగానే హైప్ వచ్చింది. ఈ చిత్రానికి హరీశ్ శంకర్ దర్శకత్వం వహిస్తున్నారు. మిస్టర్ బచ్చన్ చిత్రం ఆగస్టు 15న థియేటర్లలో విడుదల కానుంది.

మిస్టర్ బచ్చన్ చిత్రం 1980ల బ్యాక్‍డ్రాప్‍లో రూపొందినట్టు తెలుస్తోంది. ఈ మూవీ నుంచి వచ్చిన షోరీల్ చూస్తే ఇది అర్థమవుతోంది. వింటేజ్ లుక్‍తో ఉంది. ఈ షోరీల్‍లో రవితేజ గెటప్, యాక్షన్ అదిరిపోయాయి. ఈ వీడియోకు అదిరిపోయే రెస్పాన్స్ వచ్చింది. మిరపకాయ తర్వాత రవితేజ – హరీశ్ శంకర్ కాంబోలో వస్తుండటంతో మిస్టర్ బచ్చన్‍కు మంచి క్రేజ్ ఉంది. బాలీవుడ్ దిగ్గజం అమితాబ్ బచ్చన్‍కు వీరాభిమాని అయిన మాస్ మహారాజ బచ్చన్ టైటిల్‍లోనే వస్తుండడం మరింత హైప్‍ను తీసుకొచ్చింది.

మిస్టర్ బచ్చన్ మూవీలో రవితేజ సరసన భాగ్యశ్రీ బోర్సే హీరోయిన్‍గా నటిస్తున్నారు. జగపతి బాబు విలన్‍గా నటించారు. ఈ చిత్రానికి మిక్కీ జే మేయర్ సంగీతం అందిస్తున్నారు. పీపుల్ మీడియా ఫ్యాక్టరీ పతాకంపై విశ్వప్రసాద్ ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు

నేడే రెండో పాట:
మిస్టర్ బచ్చన్ చిత్రం నుంచి ఇప్పటికే ఓ మెలోడీ సాంగ్ రాగా.. నేడు (జూలై 25) మాస్ పాట వస్తోంది. ‘రెప్పల్ డప్పుల్’ పేరుతో ఈ సాంగ్ రానుంది. నేటి సాయంత్రం 5 గంటలకు ఈ లిరికల్ సాంగ్ విడుదల కానుంది.

మరిన్ని ఇటువంటి వాటి కోసం తెలుగు రీడర్స్ సినిమా ను సందర్శించండి.

You may also like

Leave a Comment

Adblock Detected

Please support us by disabling your AdBlocker extension from your browsers for our website.