ప్రస్తుతం ప్రపంచ వ్యాప్తంగా ఓటిటి వరల్డ్ ఎంతలా వ్యాప్తి చెందిందో మనం చూస్తూనే ఉన్నాం. థియేటర్స్ కి ధీటుగా సాలిడ్ కంటెంట్ చేతిలోకి అందుబాటులోకి వస్తుండడంతో మంచి ఆదరణ వీటికి వస్తుంది. ముఖ్యంగా ఎంటర్టైన్మెంట్ వీక్షకుల్ని ఎంగేజ్ చేసే కంటెంట్ తో ఓటిటి ప్లాట్ ఫామ్ లు వారు వస్తుండడంతో వీటికి మరింత ఆదరణ లభిస్తుంది.
అయితే ఈ OTTలలో స్ట్రీమింగ్ అయ్యే కంటెంట్ చూడాలంటే దానికి తగ్గ సబ్ స్క్రిప్షన్ తీసుకోవలసి ఉంటుంది. అయితే ఈ మధ్య కాలంలో కొన్ని ప్రముఖ OTT సంస్థలు కస్టమర్లుకి ఉచితంగానే ఎటువంటి సబ్ స్క్రిప్షన్ ప్లాన్ తీసుకోవలసిన అవసరం లేకుండానే స్ట్రీమింగ్ అయ్యే కంటెంట్ ను వీక్షించవచ్చని చెప్తున్నట్లు ఊహాగానాలు వినిపిస్తున్నాయి. అందులో నెట్ ఫ్లిక్స్ పేరు ప్రముఖంగా వినిపిస్తుంది. ఇది నిజమయ్యే అవకాశం ఉందా అంటే ? ఉందనే చెప్పవచ్చు.
ఎందుకంటే ఎంతో కొంత డబ్బులు చెల్లించి తీసుకొనే సబ్ స్క్రిప్షన్ ప్లాన్ ను ఉచితంగా ఇవ్వడం వలన ఆ సంస్థలకు ఆదాయం తగ్గిపోతుందని అనుకోవచ్చు, కానీ ఇక్కడే ఒక మాస్టర్ ప్లాన్ దాగి ఉంది. అదేంటంటే ఒక వేల OTT సంస్థలు ఉచిత ప్లాన్ తీసుకు వస్తే ఆ ప్లాన్ కి కొంత పరిమితిని తీసుకు వస్తారు. ఈ పరిమితిలో వాళ్ల వ్యూవర్ షిప్ తక్కువగా వుండే కంటెంట్ ను యాడ్ చేస్తారు. దీని వల్ల ఆ కంటెంట్ కి వ్యూస్ పేరుతాయి. ఇది ఉచిత ప్లాన్ కాబట్టి యాడ్స్ ను కూడా అందులో ప్లే చేస్తారు. దీంతో ఆ కంటెంట్ వ్యూస్ తో పాటు యాడ్ వ్యూస్ కూడా పెరుగుతాయి.
తద్వారా యాడ్స్ వల్ల వచ్చే ఆదాయం బాగా పెరిగిపోతుంది. ఇది సబ్ స్క్రిప్షన్ ద్వారా వచ్చే ఆదాయం కంటే ఎక్కువగా ఉంటుంది. అలాగే ఆ OTT ప్లాట్ ఫార్మ్ ని ఎక్కువ మంది సబ్ స్క్రిప్షన్ కూడా చేసుకుంటారు. దీంతో ఆ సంస్థకు వినియోగ దారులసంఖ్య కూడా బాగా పెరుగుతుంది. అలాగే యూజర్స్ కి ఈ ప్లాట్ ఫామ్ బాగా అలవాటు పడుతుంది, దీని వల్ల యూసర్స్ వేరే OTT ప్లాట్ ఫామ్ కి వెళ్ళడానికి పెద్దగా ఆసక్తి చూపించరు. అంతేకాకుండా కస్టమర్స్ పెరిగే కొద్దీ ఆ సంస్థ బ్రాండింగ్ వాల్యూ కూడా బాగా పెరుగుతుంది. దీంతో ఆ సంస్థ యొక్క షేర్స్ కూడా పెరిగే అవకాశాలు ఉన్నాయి, ఇలా చెప్పుకుంటూ పోతే అనేక లాభాలున్నాయి.
కాబట్టి OTT సంస్థలు ఫ్రీ సబ్ స్క్రిప్షన్ ఇస్తే పెద్దగా ఆశ్చర్యపడవలసిన అవసరం లేదనే చెప్పవచ్చు. ఎందుకంటే ఈ నిర్ణయం వల్ల వచ్చే నష్టాలు కంటే ఎన్నో లాభాలు ఉన్నాయి కనుక త్వరలోనే ఈ ఫ్రీ సబ్ క్రిప్షన్ వస్తుందని మనము భావించవచ్చు.
ఇలాంటి మరిన్ని వాటి కొరకుతెలుగు రీడర్స్ OTTను సందర్శించండి.