హలో తెలుగు రీడర్స్ అందరూ ఎలా వున్నారు. ఈరోజు మన ముందుకి ఒక ఆక్షన్ వెబ్ సిరీస్ వొచ్చేసింది. అది కూడా అమెజాన్ ప్రైమ్ వీడియో లో. మర్వెల్ మరియు డీసీ కామిక్స్ కి పేరడీగా వొచ్చిన ఈ సిరీస్ జనాలను ఎంతగానో ఆకట్టుకుంది. ఇది కేవలం ఒక సూపర్ హీరో కథ మాత్రమే కాదు. ఇందులో మనుషుల మధ్యవున్న రిలేషన్స్ ని, ప్రేమని, కోపాలని, తండ్రి కొడుకుల ప్రేమలను, ఆప్యాతలను మరియు యుక్తవయసు ప్రేమలను చూపిస్తూ సాగుతుంది.
ఇప్పటి వరకు మనం చెప్పుకున్న స్టోరీ ది బాయ్స్ గురించి. ఇందులో అడల్ట్ కంటెంట్ ఎక్కువ వున్నా అది అర్ధవంతంగా ఉండడం రక్తపాతాలు కూడా చాల ఎక్కువ ఉండడంతో దీనికి చాలా మంది ఆకర్షితులు అయ్యారు. ది బాయ్స్ ని వెతిరేకించేవాళ్ళు కూడా వున్నారు వాళ్ళు కేవలం సినిమా ని వినోదంగా చూడలేని వాళ్ళు.
అయినా ఇవన్నీ ఎందుకు కానీ మీరు ది బాయ్స్ ఫాన్స్ అయితే కచ్చితంగా ప్రైమ్ వీడియో లో ఈరోజె వొచ్చిన ది బాయ్స్ సీజన్ 4 లోని మొదటి మూడు భాగాలను చూసేసి మీ అనుభవాలను కింద కామెంట్ లో పంచుకోండి. మరిన్ని వివరాలకు అప్పుడప్పుడు తెలుగు రీడర్స్ ని చూడండి.
హిస్టరీ:
ది బాయ్స్ అనేది అమెజాన్ ప్రైమ్ వీడియో కోసం ఎరిక్ క్రిప్కే అభివృద్ధి చేసిన ఒక అమెరికన్ వ్యంగ్య సూపర్ హీరో టెలివిజన్ సిరీస్. గార్త్ ఎన్నిస్ మరియు డారిక్ రాబర్ట్‌సన్ రాసిన కామిక్ పుస్తకం ఆధారంగా దీన్ని తెరెకెక్కించారు. ఇది తమ అధికారాలను దుర్వినియోగం చేసే సూపర్ పవర్డ్ వ్యక్తులతో పోరాడుతున్న విజిలెంట్స్ బృందాన్నివివరిస్తుంది.
ఈ ధారావాహికలో కార్ల్ అర్బన్, జాక్ క్వాయిడ్, ఆంటోనీ స్టార్, ఎరిన్ మోరియార్టీ, డొమినిక్ మెక్‌ఎల్లిగాట్, జెస్సీ టి. అషర్, చేస్ క్రాఫోర్డ్, లాజ్ అలోన్సో, టోమర్ కాపోన్, కరెన్ ఫుకుహారా మరియు నాథన్ మిచెల్ వంటి సమిష్టి తారాగణం ఉంది.
నిజానికి ఇది ఒక ఫీచర్-లెంగ్త్ ఫిల్మ్‌గా ఉద్దేశించబడింది, కామిక్ బుక్ సిరీస్ అనుసరణ తో 2008లో ఆడమ్ మెక్‌కే ఈ చిత్రానికి దర్శకత్వం వహించడంతో దీన్ని సిరీస్ గా డెవలప్ చేయదలిచారు. కానీ రకరకాల కారణాల వల్ల మధ్యలోనే ఈ ప్రాజెక్ట్ ఆగిపోయింది. తరువాత అమెజాన్ స్టూడియోస్ నవంబర్ 2017లో ఈ సిరీస్ హక్కులను కైవసం చేసుకుని మే 2018లో ప్రొడక్షన్ ప్రారంభించింది.
మరిన్ని ఇటువంటి వాటి కోసంతెలుగు రీడర్స్‌ని సందర్శించండి.