Kailasavasa shiva shiva lyrics vijay prakash
కైలాస వాసా శివ శివా
ఈశా మహేశా శివ శివా
జై జగదీశా శివ శివా….
నీ రూపు దాచే కనులనీ
నీ పేరు పలికే మనసునీ
కైలాసమనరా శివ శివా!!
శూన్యం లో నేనుండగా
నా లోకం నీవేనయా శివయ్యా…శివయ్యా
ధనుజ దహనా శివ శివా
ధరణీ శమనా శివ శివా
ధమన నయనా శివ శివా…
శూన్యం లో నేనుండగా
నా లోకం నీవేనయా శివయ్యా…శివయ్యా
నీ చూపే దీపాలుగా
నా దారే కాచేనయా శివయ్యా..శివయ్యా
ఆది యోగివి నీవనీ
ఆది అంతము లేవనీ
ఆపదే రానీవని
విని తరించా శివా శివా!
జయహో జయహో శంకరా
భోలేనాథా శంకరా
కైలాస వాసా శివ శివా
ఈశా మహేశా శివ శివా
జై జగదీశా శివ శివా….
నీ రూపు దాచే కనులనీ
నీ పేరు పలికే మనసునీ
కైలాసమనరా శివ శివా!!
నీ తాండవాన నే కాలి మువ్వై
ఆడాలనడిగానా?
నీ గుండె పైన రుద్రాక్ష మాలై
మారాలనడిగానా?
నీ సిగనడిగానా?
సగభాగం అడిగానా?
నీ క్షేత్రము లోనే
నా మోక్షమడిగానా?
ఈ వల్లకాడే పుడమిన
నీ ఇల్లు ఐతే శివ శివా!
నీ ఇంటి ముగ్గై మారేందుకే
భస్మాన్ని కానా శివ శివా!
జయహో జయహో శంకరా
భోలేనాథా శంకరా !
కైలాస వాసా శివ శివా
ఈశా మహేశా శివ శివా
జై జగదీశా శివ శివా..
నీ రూపు దాచే కనులనీ
నీ పేరు పలికే మనసునీ
కైలాసమనరా శివ శివా!!
Read also : ugra varahi dushta samhari song lyrics
మరిన్ని ఇటువంటి లిరిక్స్ కోసం తెలుగు రీడర్స్ భక్తి ను చూడండి.

