Table of contents
1. Chittu chittula Bomma
చిత్తూ చిత్తుల బొమ్మ శివుని ముద్దుల గుమ్మ
బంగారు బొమ్మ దొరికేనమ్మో ఈ వాడ లోన
చిత్తూ చిత్తుల బొమ్మ శివుని ముద్దుల గుమ్మ
బంగారు బొమ్మ దొరికేనమ్మో ఈ వాడ లోన……1
రాగి బింద తీసుక రమణి నీళ్ళకు వోతే
రాములోరు ఎదురయే నమ్మో ఈ వాడ లోన
చిత్తూ చిత్తుల బొమ్మ శివుని ముద్దుల గుమ్మ
బంగారు బొమ్మ దొరికేనమ్మో ఈ వాడ లోన…….2
వెండి బింద తీసుక వెలది నీళ్ళకు వోతే
వెంకటేశు డెదురాయే నమ్మో ఈ వాడ లోన
చిత్తూ చిత్తుల బొమ్మ శివుని ముద్దుల గుమ్మ
బంగారు బొమ్మ దొరికేనమ్మో ఈ వాడ లోన …….3
బంగారు బింద తీసుక బామ్మా నీళ్ళకు వోతే
భగవంతుడెదురాయే నమ్మో ఈ వాడ లోన
చిత్తూ చిత్తుల బొమ్మ శివుని ముద్దుల గుమ్మ
బంగారు బొమ్మ దొరికేనమ్మో ఈ వాడ లోన ……..4
పగిడి బింద తీసుక పడతి నీళ్ళకు వోతే
పరమేశు డెదురాయే నమ్మో ఈ వాడ లోన
చిత్తూ చిత్తుల బొమ్మ శివుని ముద్దుల గుమ్మ
బంగారు బొమ్మ దొరికేనమ్మో ఈ వాడ లోన ……..5
ముత్యాల బింద తీసుక ముదిత నీళ్ళకు వోతే
ముద్దుకృష్ణుడెదురాయే నమ్మో ఈ వాడ లోన
చిత్తూ చిత్తుల బొమ్మ శివుని ముద్దుల గుమ్మ
బంగారు బొమ్మ దొరికేనమ్మో ఈ వాడ లోన …….6
2. Ememi Puvvapune Gowramma
ఏమేమి పువ్వోప్పునే గౌరమ్మ.. ఏమేమి కాయెుప్పునే
తంగేడు పువ్వోప్పునే గౌరమ్మ తంగేడు కాయెుప్పునే
తంగేడు పువ్వులో తంగేడు కాయలో
ఆట చిలుకలు రెండు పాట చిలుకలు రెండు
కలికి చిలుకలు రెండు కందువా మేడలో (1)
ఏమేమి పువ్వోప్పునే గౌరమ్మ.. ఏమేమి కాయెుప్పునే
తెలుగంటి పువ్వోప్పునే గౌరమ్మ తెలుగంటి కాయెుప్పునే
తెలుగంటి పువ్వులో తెలుగంటి కాయలో
ఆట చిలుకలు రెండు పాట చిలుకలు రెండు
కలికి చిలుకలు రెండు కందువా మేడలో (2)
ఏమేమి పువ్వోప్పునే గౌరమ్మ.. ఏమేమి కాయెుప్పునే
ఉమ్మెత్త పువ్వొప్పునే గౌరమ్మ ఉమ్మెత్త కాయెుప్పునే
ఉమ్మెత్త పువ్వులో ఉమ్మెత్త కాయలో
ఆట చిలుకలు రెండు పాట చిలుకలు రెండు
కలికి చిలుకలు రెండు కందువా మేడలో (3)
ఏమేమి పువ్వోప్పునే గౌరమ్మ.. ఏమేమి కాయెుప్పునే
జిల్లేడు పువ్వోప్పునే గౌరమ్మ జిల్లేడు కాయెుప్పునే
జిల్లేడు పువ్వులో జిల్లేడు కాయలో
ఆట చిలుకలు రెండు పాట చిలుకలు రెండు
కలికి చిలుకలు రెండు కందువా మేడలో (4)
ఏమేమి పువ్వోప్పునే గౌరమ్మ.. ఏమేమి కాయెుప్పునే
మందార పువ్వోప్పునే గౌరమ్మ మందార కాయెుప్పునే
మందార పువ్వులో మందార కాయలో
ఆట చిలుకలు రెండు పాట చిలుకలు రెండు
కలికి చిలుకలు రెండు కందువా మేడలో (5)
ఏమేమి పువ్వోప్పునే గౌరమ్మ.. ఏమేమి కాయెుప్పునే
గుమ్మడి పువ్వోప్పునే గౌరమ్మ గుమ్మడి కాయెుప్పునే
గుమ్మడి పువ్వులో గుమ్మడి కాయలో
ఆట చిలుకలు రెండు పాట చిలుకలు రెండు
కలికి చిలుకలు రెండు కందువా మేడలో (5)
ఏమేమి పువ్వోప్పునే గౌరమ్మ.. ఏమేమి కాయెుప్పునే
గన్నేరు పువ్వోప్పునే గౌరమ్మ.. గన్నేరు కాయెుప్పునే
గన్నేరు పువ్వులో గన్నేరు కాయలో
ఆట చిలుకలు రెండు పాట చిలుకలు రెండు
కలికి చిలుకలు రెండు కందువా మేడలో (6)
3.Rama Rama Rama Uyyalo
రామ రామ రామ ఉయ్యాలో
రామనే శ్రీరామ ఉయ్యాలో
హరి హరి ఓ రామ ఉయ్యాలో
హరియ బ్రహ్మదేవ ఉయ్యాలో…..1
నెత్తిమీది సూర్యుడా ఉయ్యాలో
నెలవన్నెకాడ ఉయ్యాలో
పాపట్ల చంద్రుడా ఉయ్యాలో
బాల కోమారుడా ఉయ్యాలో…..2
ముందుగా నినుదల్తు ఉయ్యాలో
ముక్కోటి పోశవ్వ ఉయ్యాలో
అటెన్క నినుదల్తు ఉయ్యాలో
అమ్మ పార్వతమ్మ ఉయ్యాలో….3
భక్తితో నినుదల్తు ఉయ్యాలో
బాసర సరస్వతీ ఉయ్యాలో
ఘనంగాను కొల్తు ఉయ్యాలో
గణపతయ్య నిన్ను ఉయ్యాలో….4
ధర్మపురి నరసింహ ఉయ్యాలో
దయతోడ మముజూడు ఉయ్యాలో
కాళేశ్వరం శివ ఉయ్యాలో
కరుణతోడ జూడు ఉయ్యాలో…..5
సమ్మక్క సారక్క ఉయ్యాలో
సక్కంగ మముజూడు ఉయ్యాలో
భద్రాద్రి రామన్న ఉయ్యాలో
భవిత మనకు జెప్పు ఉయ్యాలో….6
యాదితో నినుదల్తు ఉయ్యాలో
యాదగిరి నర్సన్న ఉయ్యాలో
కోటిలింగాలకు ఉయ్యాలో
కోటి దండాలురా ఉయ్యాలో…..7
కోర్కెతో నినుదల్తు ఉయ్యాలో
కొంరెల్లి మల్లన్న ఉయ్యాలో
కొండగట్టంజన్న ఉయ్యాలో
కోటి దండాలురా ఉయ్యాలో…..8
కోర్కెమీర దల్తు ఉయ్యాలో
కొత్తకొండీరన్న ఉయ్యాలో
ఎరుకతో నినుదల్తు ఉయ్యాలో
ఎములాడ రాజన్న ఉయ్యాలో…..9
ఓర్పుతో నినుదల్తు ఉయ్యాలో
ఓదెలా మల్లన్న ఉయ్యాలో
ఐలేని మల్లన్న ఉయ్యాలో
ఐకమత్య మియ్యి ఉయ్యాలో…..10
మన తల్లి బతుకమ్మ ఉయ్యాలో
మన మేలుకోరు ఉయ్యాలో
బతుకమ్మ బతుకమ్మ ఉయ్యాలో
బంగారు బతుకమ్మ ఉయ్యాలో…..11
4. Kalavari kodalu uyyalo
కలవారి కోడలు ఉయ్యాలో
కనక మహాలక్ష్మి ఉయ్యాలో
కడుగుతున్నది పప్పు ఉయ్యాలో
కడవళ్లోన పోసి ఉయ్యాలో
అప్పుడే వచ్చేను ఉయ్యాలో
ఆమె పెద్దన్న ఉయ్యాలో
కాళ్లకు నీళ్లిచ్చి ఉయ్యాలో
కన్నీళ్లు దీసి ఉయ్యాలో
ఎందుకు సెల్లెలా ఉయ్యాలో
ఏమి కష్టాలమ్మా ఉయ్యాలో
తుడుచుకో కన్నీళ్లు ఉయ్యాలో
ముడుచుకో కురులమ్మ ఉయ్యాలో
ఎత్తుకో బిడ్డాను ఉయ్యాలో
వెళ్లి వద్దాము ఉయ్యాలో
చేరిమి వారితో ఉయ్యాలో
చెప్పిరా పోవమ్మా ఉయ్యాలో
పట్టె మంచం మీద ఉయ్యాలో
పవళించినామా ఉయ్యాలో
మాయన్నల వచ్చిరి ఉయ్యాలో
మమ్ము పంపుతారా ఉయ్యాలో
నేనెరుగ నేనెరుగ ఉయ్యాలో
మీ అత్తను అడుగు ఉయ్యాలో
అరుగుల్ల కూసున్న ఉయ్యాలో
ఓ అత్తగారు ఉయ్యాలో
మా అన్నలు వచ్చిరి ఉయ్యాలో
మమ్ము పంపుతారా ఉయ్యాలో
నేనెరుగ నేనెరుగ ఉయ్యాలో
మీ బావను అడుగు ఉయ్యాలో
భారతం చదివేటి ఉయ్యాలో
బావ పెద్ద బావ ఉయ్యాలో
మా అన్నలు వచ్చిరి ఉయ్యాలో
మమ్ము పంపుతారా ఉయ్యాలో
నేనెరుగ నేనెరుగ ఉయ్యాలో
మీ అక్కను అడుగు ఉయ్యాలో
వంటశాలలో ఉన్న ఉయ్యాలో
ఓ అక్క గారూ ఉయ్యాలో
మా అన్నలు వచ్చిరి ఉయ్యాలో
మమ్ము పంపుతారా ఉయ్యాలో
నేనెరుగ నేనెరుగ ఉయ్యాలో
నీ భర్తనే అడుగు ఉయ్యాలో
రచ్చలో కూర్చున్న ఉయ్యాలో
రాజేంద్రబోగి ఉయ్యాలో
మా అన్నలు వచ్చిరి ఉయ్యాలో
మమ్ము పంపుతారా ఉయ్యాలో
కట్టుకో చీరలు ఉయ్యాలో
పెట్టుకో సొమ్ములు ఉయ్యాలో
ఎత్తుకో బిడ్డను ఉయ్యాలో
వెళ్లి రా ఊరికి ఉయ్యాలో
పుట్టినింటికి నీవు ఉయ్యాలో
శుభముగా పోయిరా ఉయ్యాలో
మెట్టినింటికి నీవు ఉయ్యాలో
క్షేమంగా తిరిగి రా ఉయ్యాలో
మెట్టినింటికి నీవు ఉయ్యాలో
క్షేమంగా తిరిగి రా ఉయ్యాలో
5. Okkesi puvvesi chandamama
ఒక్కేసి పువ్వేసి చందమామా..ఒక్క జాము ఆయె చందమామా..
కింద ఇల్లు కట్టి చందమామా..పైన మఠం కట్టి చందమామా..
మఠంలో ఉన్న చందమామా..మాయదారి శివుడు చందమామా..
శివపూజ వేళాయె చందమామా..శివుడు రాకపాయె చందమామా..
గౌరి గద్దెల మీద చందమామా..జంగమయ్య ఉన్నాడె చందమామా..
రెండేసి పూలేసి చందమామా..రెండు జాములయె చందమామా..
శివపూజ వేళాయె చందమామా..శివుడు రాకపాయె చందమామా..
మూడేసి పూలేసి చందమామా..మూడు జాములాయె చందమామా..
శివపూజ వేళాయె చందమామా..శివుడు రాకపాయె చందమామా..
నాలుగేసి పూలేసి చందమామా..నాలుగు జాములాయె చందమామా..
శివపూజ వేళాయె చందమామా..శివుడేలా రాకపాయె చందమామా..
ఐదేసి పూలేసి చందమామా..ఐదు జాములాయె చందమామా..
శివపూజ వేళాయె చందమామా..శివుడు రాకపాయె చందమామా..
ఆరేసి పూలేసి చందమామా..ఆరు జాములాయె చందమామా..
శివపూజ వేళాయె చందమామా..శివుడు రాకపాయె చందమామా..
ఏడేసి పూలేసి చందమామా..ఏడు జాములయె చందమామా..
శివపూజ వేళాయె చందమామా..శివుడు రాకపాయె చందమామా..
ఎనిమిదేసి పూలేసి చందమామా..ఎనిమిది జాములాయె చందమామా..
శివపూజ వేళాయె చందమామా..శివుడు రాకపాయె చందమామా..
తొమ్మిదేసి పూలేసి చందమామా..తొమ్మిది జాములాయె చందమామా..
శివపూజ వేళాయె చందమామా..శివుడు రాకపాయె చందమామా..
తంగేడు వనములను చందమామా..తాళ్లు కట్టబోతిరి చందమామా..
గుమ్మాడి వనమునకు చందమామా..గుడి కట్టబోయే చందమామా..
రుద్రాక్ష వనమునకు చందమామా..నిద్ర చేయపోయె చందమామా..
నీనోము నీకిత్తునే గౌరమ్మ..నా నోము నాకియ్యవే గౌరమ్మ..
శివపూజ వేలాయె చందమామ..శివుడొచ్చి కూర్చునే చందమామ
మరిన్ని ఇటువంటి వాటి కోసం తెలుగు రీడర్స్ భక్తి ను చూడండి.

