ఉగ్రవారాహి దుష్టసంహారి శతృవినాశిని నీవేలే లిరిక్స్ | Vagdevi

by Lakshmi Guradasi

పల్లవి:
ఉగ్రవారాహి దుష్టసంహారి శతృవినాశిని నీవేలే..
చండికానుండి ఉద్భవించిన సప్తమాత్రికవు నీవేలే..
ఉగ్రవారాహి దుష్టసంహారి శతృవినాశిని నీవేలే..
చండికానుండి ఉద్భవించిన సప్తమాత్రికవు నీవేలే..
విశ్వ ప్రాణహరి వారాహి.. వీర్య నందితా వారాహి..
ఉగ్రరూపిణీ వారాహి..
ఓం ఐం క్లీం ఐం సర్వసిద్ధి ప్రదాయే..
ఓం వారాహీ దేవి నమో నమః నమో నమః..
ఓం ఐం క్లీం ఐం సర్వసిద్ధి ప్రదాయే..
ఓం వారాహీ దేవి నమో నమః నమో నమః..

చరణం 1:
రైతన్న కండగా ఉంటావే దేవి..
సమరంలో ఆధిపత్యం నీదే దేవి..
మా బాధలను తీర్చే మహంకాళి..
మా చీకటిని మాపే దీపావళి..
కోరిన వరముల నీచే తల్లి..
కాళికాదేవి నీవేనమ్మ..
రేయి మాత్రమే మాకు దర్శనం..
ఓం ఐం క్లీం ఐం సర్వసిద్ధి ప్రదాయే..
ఓం వారాహీ దేవి నమో నమః నమో నమః..
ఓం ఐం క్లీం ఐం సర్వసిద్ధి ప్రదాయే..
ఓం వారాహీ దేవి నమో నమః నమో నమః..

చరణం 2:
వేపాకుల మాలలు నీకే కాళి..
ఉన్మత్త భైరవుడికే నీవు ఆలివి..
సరిపోదు ఏ రాకాసి నీ గోటికి..
మా కోసమే నీవు దిగిరావాలి..
కాశి నే కాపాడే తల్లి..
వారాహివి నీవేనమ్మ..
కులదేవతవే అయోధ్యకి..
ఓం ఐం క్లీం ఐం సర్వసిద్ధి ప్రదాయే..
ఓం వారాహీ దేవి నమో నమః నమో నమః..
ఓం ఐం క్లీం ఐం సర్వసిద్ధి ప్రదాయే..
ఓం వారాహీ దేవి నమో నమః నమో నమః..

చరణం 3:
ఎర్రటి వస్త్రం నీకిష్టం దేవి..
ప్రదోష కాలం నీకిష్టం కాళి..
సాంబ్రాణి ధూపం నీకిష్టం అమ్మా..
చిత్రాన్నమంటే నీకిష్టమాయమ్మ..
ఆషాఢ వారాహి నవరాత్రులు..
సిద్ధంగా ఉంచాము నీ కోసము..
మమ్మల్ని కాపాడ రావమ్మ..
ఓం ఐం క్లీం ఐం సర్వసిద్ధి ప్రదాయే..
ఓం వారాహీ దేవి నమో నమః నమో నమః..
ఓం ఐం క్లీం ఐం సర్వసిద్ధి ప్రదాయే..
ఓం వారాహీ దేవి నమో నమః నమో నమః..

అమ్మా.. తల్లి.. అమ్మా..
ఓం.. ఓం..

________________________

Read also: శుక్రవారమమ్మ నీకు చక్కాని దినము తల్లి లిరిక్స్

మరిన్ని ఇటువంటి లిరిక్స్ కోసం తెలుగు రీడర్స్ భక్తి ను చూడండి.

You may also like